Samantha : చీటికీ మాటికీ ముంబై వెళ్తున్న స‌మంత‌.. చైత‌న్య‌నే కార‌ణ‌మా..?

May 27, 2022 8:03 AM

Samantha : అక్కినేని నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు చెప్పిన‌ప్ప‌టి నుంచి స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ కూడా చేసింది. అలాగే ప‌లు బ్రాండ్ల‌ను కూడా ప్ర‌మోట్ చేస్తోంది. దీంతోపాటు సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర‌స్ ఫొటోషూట్స్‌ను పోస్ట్ చేస్తోంది. ప‌లు మ్యాగ‌జైన్ల‌కు చెందిన క‌వ‌ర్ ఫొటోల‌కు పోజులు కూడా ఇస్తోంది. అయితే స‌మంత ఈ మ‌ధ్య కాలంలో చీటికీ మాటికీ ముంబై వెళ్తోంది. హైద‌రాబాద్‌కు రావ‌డం.. షూటింగ్ చేయ‌డం.. ప‌ని అవ‌గానే ముంబై వెళ్ల‌డం.. ఇదీ స‌మంత చేస్తున్న ప‌ని. అయితే ఇలా స‌మంత మాటిమాటికీ ముంబై ఎందుకు వెళ్తోంది.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి.. అన్న విష‌యానికి వ‌స్తే..

హైద‌రాబాద్‌లో నాగ‌చైత‌న్య ఉంటాడు క‌దా.. అలాగే ఇక్క‌డ ఉండ‌డం వ‌ల్ల మీడియాకు కూడా ఎదురు ప‌డాల్సి వ‌స్తోంది. దీంతో వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక‌పోతున్న‌ద‌ట‌. నాగ‌చైత‌న్య ఉండేది హైద‌రాబాద్‌లోనే క‌నుక‌.. ఆమెకు ఇంకా పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తూ ఉంటాయి. క‌నుక వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకే స‌మంత ముంబైలో నివ‌సిస్తుంద‌ని తెలుస్తోంది. అలాగే అక్క‌డ ఆమెకు ప‌లు ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయ‌ట‌. క‌నుక కేవ‌లం ప‌ని ఉన్న‌ప్పుడే హైద‌రాబాద్‌కు వ‌చ్చి వెళ్తోంది. పూర్తి స్థాయిలో ఆమె ముంబైలోనే ఉంటోంది.

Samantha frequent trips to Mumbai this may be the reason
Samantha

ఇక స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి న‌టిస్తున్న ఖుషి మూవీ తొలి షెడ్యూల్ ఇటీవ‌లే పూర్త‌యింది. కాశ్మీర్‌లో షూటింగ్ చేశారు. అలాగే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న య‌శోద మూవీ ఆగ‌స్టులో విడుద‌ల కానుంది. దీంతోపాటు ఓ సిరీస్‌లోనూ ఈమె న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now