Samantha : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తోంది. ఆమె చైకి విడాకులు ఇవ్వడానికి పలు కారణాలు చెబుతూ ప్రముఖ ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేసింది. సామ్-చై ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనాలు.. అటుపై ఇద్దరి మద్య సాగిన బంధం గురించి.. ఆ తర్వాత వివాదం మొదలైన నాటి నుంచి ఇద్దరి మధ్య పెరిగిన దూరం గురించి ఆసక్తికర కథనాల్ని ప్రసారం చేసింది. ఇలాంటివి తనని ఏం చేయలేవని సమంత చెప్పుకొచ్చింది.
రీసెంట్‌గా సదరు ఛానల్ సమంతతో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవాలని భావించిందట. తద్వారా టీఆర్పీ రేటింగ్ కూడా పెంచుకోవాలని చూసిందట. కాని ఆ ఛానల్ పేరెత్తితేనే సమంత కస్సుబస్సుమంటుందట. వాళ్లకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వనని డైరెక్ట్‌గా చెప్పేసిందట. ఇదిలా ఉంటే సమంత విడాకుల తర్వాత ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఎపిసోడ్ దసరా కానుకగా ప్రసారం కానుంది.
ఎన్టీఆర్‌తో సమంత చేసే సందడి ఓ రేంజ్‌లో ఉండనుందని ప్రోమో చూస్తుంటేనే అర్దమవుతుంది. ఇక సమంత విడాకుల తర్వాత సామ్ మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సమంతకు ఫ్యామిలీ లైఫ్ అంటే ఎంతో ఇష్టమని.. పిల్లల్ని కని జీవితంలో స్థిరపడాలని ఎంతో ఆశ పడిందని తెలిపింది. అందుకోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఎన్నో పెద్ద అవకాశాలు వచ్చినా కాదనుకుంది.. అని పలు విషయాలు వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…