Samantha : సినిమాల క‌న్నా ఆ మార్గాల్లోనే ఎక్కువ‌గా సంపాదిస్తున్న స‌మంత ?

October 2, 2021 11:31 AM

Samantha : సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే స‌మంత‌కు ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 18.9 మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. అయితే అటు సినిమాల‌తోపాటు ఇటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ కూడా స‌మంత రెండు చేతులా సంపాదిస్తోంది. మ‌రోవైపు త‌న సొంత బ్రాండ్ సాకీ ఉండ‌నే ఉంది. దాంతో కూడా ఆదాయం వ‌స్తుంది. అలాగే ప‌లు కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌కు ఆమె బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉంది. దీంతో స‌మంత సినిమాల క‌న్నా ఇత‌ర మార్గాల్లోనే ఎక్కువ‌గా సంపాదిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

Samantha : సినిమాల క‌న్నా ఆ మార్గాల్లోనే ఎక్కువ‌గా సంపాదిస్తున్న స‌మంత ?

తాజాగా స‌మంత రెండు కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తులకు చెందిన పోస్టుల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాగ చైత‌న్య‌తో విడాకులు తీసుకునే వార్త‌ల‌ను అటుంచితే ఆమె మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. ఫ్రెండ్స్‌తో వెకేష‌న్‌లో ఉన్న ఆమె.. ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మ‌రోవైపు ఇలా ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల‌తో సంపాదిస్తోంది.

ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ.7 ల‌క్ష‌ల నుంచి రూ.13 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. కాగా స‌మంత ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార న‌టిస్తున్న కాథు వాకుల రెండు కాద‌ల్ అనే సినిమాతోపాటు తెలుగులో గుణ శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లం అనే మూవీలోనూ న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now