Samantha : టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్నారు. అసలు వారిద్దరూ విడిపోతారని ఎవరూ అనుకోలేదు. వారి విడాకుల నిర్ణయం ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని తరువాత పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. కానీ వారు ఎందుకు విడిపోయారన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
అయితే నాగచైతన్య నుంచి సమంత విడిపోవడం వెనుక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. చైతూ ఆమెను ఏదో అని ఉంటాడని.. కానీ బయటకు చెప్పలేని సమంత తీవ్రంగా హర్ట్ అయిందని.. అందువల్లే ఆమె ఇష్టం లేకున్నా చైతన్య నుంచి విడిపోయిందని తెలుస్తోంది. అయితే సమంత హర్ట్ అయిన విషయాన్ని మనం తాజాగా జరిగిన పరిణామాలను గమనిస్తే తెలుస్తుంది.
ఇటీవల నాగచైతన్య బర్త్ డేకు అందరూ విషెస్ చెప్పారు. కానీ సమంత చెప్పలేదు. పైగా తన కుక్క బర్త్ డేకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఏకంగా పోస్ట్‌నే పెట్టింది. దీంతో సమంతపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చైతన్య గతంలో ఏదో అని ఉంటాడని, అందువల్లే సమంత హర్ట్ అయి విడాకులు ఇచ్చిందని.. ఆ విషయం తాజాగా ఆమె చేసిన బర్త్ డే పోస్టును చూస్తే అర్థమవుతుంది.
సాధారణంగా విడాకులు అయినాక కూడా సెలబ్రిటీల జంటలు ముఖ్యమైన వేడుకలకు వెళ్తుంటారు. ఆయా సందర్భాల్లో విషెస్ చెప్పుకుంటారు. కానీ సమంత.. చైతూకు బర్త్ డే విషెస్ చెప్పలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయిందని స్పష్టమవుతుంది. రీసెంట్‌గా ఆమె పెడుతున్న సందేశాత్మక పోస్ట్‌లు కూడా ఆమె హర్ట్ అయిన విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. కనుక ఆమె హర్ట్ అయినట్లు బలంగా నమ్మవచ్చు. మరి ఆమెను హర్ట్ చేసేంతగా నాగచైతన్య లేదా అతని కుటుంబ సభ్యులు ఏం అన్నారు ? ఏం చేశారు ? అన్నది మాత్రం తెలియడం లేదు. కానీ సమంత తీరును చూస్తే తీవ్రంగా హర్ట్ అయినట్లు అవగతం అవుతుంది. కనుక విడాకులకు కారణం అదేనని అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…