హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయిన స‌మంత‌.. పూర్తిగా మారిపోయిందిగా..!

November 7, 2022 9:34 PM

గ‌త కొంత కాలంగా స‌మంత మ‌యోసైటిస్ అనే తీవ్ర స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అమెరికా వెళ్లిన స‌మంత కొంత‌కాలం పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంది. ఇండియాకు వ‌చ్చీ రాగానే ఒక డాగ్ ఫుడ్ యాడ్ చేసింది. అందులో ఆమె పూర్తిగా మారిపోయిన ముఖాన్ని చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె త‌న ముఖానికి స‌ర్జరీ చేయించుకుంద‌ని.. అందుక‌నే చాలా కాలం పాటు అంద‌రికీ దూరంగా ఉంద‌ని అర్థ‌మైంది. అయితే ఆ త‌రువాత వెంట‌నే ఆమె హాస్పిట‌ల్‌లో చేరి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.

హాస్పిట‌ల్ బెడ్‌పై త‌న కొత్త సినిమా య‌శోద‌కు డ‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను స‌మంత షేర్ చేసింది. అలాగే త‌న‌కున్న వ్యాధి వివ‌రాల‌ను కూడా పోస్ట్ లో పెట్టింది. త‌న‌కు మ‌యోసైటిస్ ఉంద‌ని, చికిత్స తీసుకుంటున్నాన‌ని.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాన‌ని చెప్పింది. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్ కాగా.. అంద‌రూ ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలోనూ ఆమెకు బెస్టాఫ్ ల‌క్ చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే ప్ర‌స్తుతం స‌మంత హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయింది. ఈ క్ర‌మంలోనే ఓ ఫొటోషూట్ కూడా చేసింది. అందులో ఆమె న‌లుపు రంగు దుస్తుల‌ను ధ‌రించి అద్దాలు పెట్టుకుని ఉంది. త‌న రాబోయే సినిమా య‌శోద కోసం ఆమె ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తుంద‌ని తెలుస్తోంది.

samantha discharged from hospital yashoda movie promotions

అందులో భాగంగానే ఆమె యాంక‌ర్ సుమ‌తో ఓ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ కూడా చేసింద‌ట‌. అది త్వ‌ర‌లోనే ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక స‌మంత న‌టించిన య‌శోద మూవీ ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానుండ‌గా.. ఈ మూవీ ట్రైల‌ర్ ఇప్ప‌టికే రిలీజ్ అయి అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇందులో భ్రూణ హ‌త్య‌లు, స‌రోగ‌సి వంటి అంశాలు ఉన్న‌ట్లుగా ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక నాగ‌చైత‌న్య నుంచి విడిపోయాక స‌మంత న‌టించిన త‌మిళ మూవీ కాతు వాకుల రెండు కాద‌ల్ రిలీజ్ అయి ఫెయిల్ కాగా.. ఇప్పుడు విడుద‌ల‌వుతున్న య‌శోద మూవీ రెండ‌వది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now