Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ తోపాటు రియల్ లైఫ్ లోనూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన జంట సమంత, నాగచైతన్య. ముచ్చటగా ఉండే ఈ జంట విడాకుల తర్వాత తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో చాలా మార్పులే వచ్చాయి. మొదట సమంత అక్కినేని నుండి అక్కినేని అనే పేరుని తీసేసింది. ఆ తర్వాత సమంత పేరుతోనే కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్ గా కూడా సమంత ఆధ్యాత్మికంగా తీర్థయాత్ర కంప్లీట్ చేసుకుని, తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకుంది.
అయితే వీరిద్దరి విడాకుల తర్వాత నాగచైతన్య ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ని సామ్ ఫాలో అవుతూనే ఉంది. అలాగే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి చైతూతో కలిసి ఉన్న ఫోటోల్ని సుమారు 80 కు పైగా ఫోటోస్ ని డిలీట్ చేసింది. కేవలం వీరిద్దరూ కలిసున్న ఫోటోస్ ని మాత్రమే సామ్ డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. మరి నాగచైతన్యను ఫాలో అవుతున్న సామ్ త్వరలో అన్ ఫాల్ చేస్తుందేమో చూడాలి. లేటెస్ట్ గా సమంత తన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ లతో ఉన్న ఓ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. రీసెంట్ గా శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రను ఫినిష్ చేసుకుంది.
లేటెస్ట్ గా సామ్ ఓ పోస్ట్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిల్ని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పెంచాలని.. భారత మహిళా హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్ట్ ను షేర్ చేసంది. మీ కూతుర్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారనేది ఆలోచించకుండా ఆమెను మరింత శక్తివంతంగా మార్చండి. ఆడపిల్ల పెళ్ళి కోసం దాచే డబ్బుల్ని ఆమె ఎడ్యుకేషన్ కి ఖర్చు పెట్టండి. అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ తోపాటు ఆత్మస్థైర్యంతో భయపడకుండా నిలబడగలిగేలా బ్రతికేలా నేర్పాలని తన పోస్ట్ లో తెలిపింది. ప్రజంట్ నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. సమంత శాకుంతలం సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మరో పక్క కోలీవుడ్ లో తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…