Priyamani : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. ఫస్ట్ టైమ్ సినీ ఇండస్ట్రీలోకి 2003లో ఎవరే అతగాడు అనే సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు రాకపోయినా.. ఆ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ అనే సినిమాతో సూపర్ హిట్ ని సాధించి ఓ రేంజ్ హీరోయిన్ గా స్టార్ డమ్ ని అందుకుంది. ఆ తర్వాత ప్రియమణికి సినిమాల్లో అవకాశాలు విపరీతంగా వచ్చాయి. ఇటు టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాల్ని అందుకుంది.
మరో పక్క వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ.. ప్రేక్షకులకు మరింత చేరువయింది. ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 1, 2 సిరీస్ లో ప్రియమణి అద్భుతంగా యాక్ట్ చేసింది. ఈమె నటనకు ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ప్రియమణి ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పూర్తవుతోంది. అయినా కూడా నటిగా ఆమె పేరును పెంచే పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. బుల్లితెర టీవీ షోస్ లో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
అలాగే తన కెరీర్ విశేషాలను, పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫోటో షూట్ లో ప్రియమణి ఎంతో అందంగా ఉంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తన ఫోటోస్ ని షేర్ చేస్తూ.. ఓ బ్యూటిఫుల్ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది. ప్రియమణి ఫోటోస్ తోపాటు క్యాప్షన్ కూడా వైరల్ అవుతోంది. జీవితం చాలా త్వరగా గడుస్తోంది.. కనుక వీలైనంత వరకు హాయిగా నవ్వండి, కొత్త పనులు నేర్చుకోండి, మనుషుల్ని క్షమించేయండి, పగను వీడండి, గతాన్ని మరిచిపోండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి.. అంటూ పోస్ట్ చేసింది.. ప్రియమణి.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…