Priyamani : ప్రియమణికి ఎవరి మీద అయినా పగ ఉందా ? మరిచిపోవాలంటోంది..!

October 28, 2021 1:26 PM

Priyamani : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. ఫస్ట్ టైమ్ సినీ ఇండస్ట్రీలోకి 2003లో ఎవరే అతగాడు అనే సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు రాకపోయినా.. ఆ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ అనే సినిమాతో సూపర్ హిట్ ని సాధించి ఓ రేంజ్ హీరోయిన్ గా స్టార్ డమ్ ని అందుకుంది. ఆ తర్వాత ప్రియమణికి సినిమాల్లో అవకాశాలు విపరీతంగా వచ్చాయి. ఇటు టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాల్ని అందుకుంది.

does Priyamani have any revenge in past

మరో పక్క వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ.. ప్రేక్షకులకు మరింత చేరువయింది. ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన ఫ్యామిలీ మ్యాన్‌ 1, 2 సిరీస్ లో ప్రియమణి అద్భుతంగా యాక్ట్ చేసింది. ఈమె నటనకు ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ప్రియమణి ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పూర్తవుతోంది. అయినా కూడా నటిగా ఆమె పేరును పెంచే పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. బుల్లితెర టీవీ షోస్ లో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

అలాగే తన కెరీర్ విశేషాలను, పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. రీసెంట్ గా జరిగిన ఫోటో షూట్ లో ప్రియమణి ఎంతో అందంగా ఉంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తన ఫోటోస్ ని షేర్ చేస్తూ.. ఓ బ్యూటిఫుల్ కొటేషన్ కూడా పోస్ట్ చేసింది. ప్రియమణి ఫోటోస్ తోపాటు క్యాప్షన్ కూడా వైరల్ అవుతోంది. జీవితం చాలా త్వరగా గడుస్తోంది.. కనుక వీలైనంత వరకు హాయిగా నవ్వండి, కొత్త పనులు నేర్చుకోండి, మనుషుల్ని క్షమించేయండి, పగను వీడండి, గతాన్ని మరిచిపోండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి.. అంటూ పోస్ట్ చేసింది.. ప్రియమణి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now