Samantha : అబ్బా.. మ‌ళ్లీ వాయిదా వేశారు.. తీర్పు వ‌చ్చేనా..?

October 25, 2021 11:22 PM

Samantha : త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ దుష్ప్ర‌చారం చేశాయ‌ని ఆరోపిస్తూ.. స‌మంత తాజాగా కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కేసులో తీర్పును న్యాయ‌మూర్తి మ‌ళ్లీ వాయిదా వేశారు. దీంతో స‌మంత అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

Samantha defamation case judgement reserved for tuesday

నిజానికి ఈ కేసును మొద‌ట గురువారం విచారణ చేప‌ట్టగా.. స‌మంత త‌రఫు లాయ‌ర్ బాలాజీ కోర్టుకు ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి చేశారు. స‌మంత న‌టి క‌నుక‌, బిజీగా ఉంటుంది క‌నుక కేసును త్వ‌ర‌గా ముగించాల‌ని కోరారు. అయితే చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అని.. స‌మంత ప్ర‌త్యేకం ఏమీ కాద‌ని.. అన్ని ప‌రువు న‌ష్టం కేసుల్లాగే ఆమె కేసును కూడా విచారిస్తామ‌ని.. న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే కేసును శుక్ర‌వారానికి వాయిదా వేశారు.

అయితే శుక్ర‌వారం కోర్టులో మ‌ళ్లీ వాద‌న‌లు జ‌రిగాయి. ప‌రువు న‌ష్టం కేసులో డ‌బ్బు అడిగే బ‌దులు క్ష‌మాప‌ణ‌లు కోరాల‌ని.. అడ‌గ‌వ‌చ్చు క‌దా.. అని న్యాయ‌మూర్తి అన్నారు. అయితే తాము డ‌బ్బు అడ‌గ‌లేద‌ని, క్ష‌మాప‌ణ‌లు మాత్ర‌మే కోరుతున్నామ‌ని, అలాగే స‌ద‌రు యూట్యూబ్ చాన‌ల్స్ కు చెందిన లింక్‌ల‌ను కూడా డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని లాయ‌ర్ కోరారు. దీంతో శుక్ర‌వారం నుంచి సోమ‌వారానికి కేసు విచార‌ణ వాయిదా ప‌డింది.

ఇక సోమ‌వారం కూడా విచార‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే లాయ‌ర్ బాలాజీ మాట్లాడుతూ.. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛాన‌ల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదన్నారు. అనేక అవార్డులు, రివార్డులు సమంత తీసుకుందని, అలాంటి వ్యక్తి పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విదంగా ప్రవరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు ప్ర‌సారం చేస్తున్నార‌ని, ట్విట్టర్ వేదికగా విడిపోతున్నామని ప్రకటించగానే సోషల్ మీడియాలో సమంతను విపరీతంగా ట్రోల్ చేశార‌ని అన్నారు. ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని.. కోర్టుకు తెలిపారు. ఇక త‌మ పిటిషన్ లో ఎక్కడా డబ్బులు అడగలేదని, యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరామ‌ని, అలాగే భవిష్యత్తులోనూ ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. కాగా గతంలోనూ శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింద‌ని.. బాలాజీ కోర్టుకు తెలిపారు.

కాగా ఇరువురి వాదనలు విన్న న్యాయ‌మూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డింది. మ‌రి ఈ రోజు అయినా తీర్పు వ‌స్తుందా.. లేక ఆల‌స్యం అవుతుందా.. అన్న‌ది చూడాలి. కానీ.. తీర్పు ఆల‌స్యం అవుతుండ‌డంపై స‌మంత నిరాశ‌కు, అసంతృప్తికి గురైన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now