Samantha : స‌మంత డబ్బులిచ్చి.. నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయింద‌ట‌..!

July 24, 2022 10:14 PM

Samantha : ప్ర‌స్తుత త‌రుణంలో స‌మంత పేరు సోష‌ల్ మీడియాలో, వార్త‌ల్లో మారుమోగిపోతోంది. ఈమె ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హించిన కాఫీ విత్ క‌ర‌ణ్ అనే షోలో పాల్గొని త‌న వైవాహిక జీవితానికి సంబంధించిన కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించింది. అలాగే సినిమాల గురించి కూడా చెప్పింది. కానీ ఆమె చేసిన వ్యాఖ్య‌లే దుమారం రేపుతున్నాయి. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

కాఫీ విత్ క‌ర‌ణ్ అనే షోలో పాల్గొన్న స‌మంత అందులో క‌ర‌ణ్ జోహార్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతూ.. మీరు టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయ్యార‌ట క‌దా.. అని అడ‌గ్గా.. అందుకు ఆమె న‌వ్వుతూ బ‌దులిస్తూ.. అవును.. నేను డ‌బ్బులిచ్చి నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ అయ్యా.. అని బ‌దులు చెప్పింది. అయితే ఆమె నిజంగానే ఓర్ మాక్స్ అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా నిలిచింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగుతోంది. ఆమె నిజంగానే ఇందుకు గాను డ‌బ్బులు ఇచ్చిందా.. అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె షోలో యాదృచ్చికంగానే అలా అని ఉంటుంద‌ని.. ఆమె నంబ‌ర్ వ‌న్ అవ‌డం ఆమెకు ముందుగా తెలియ‌క‌పోవ‌చ్చ‌ని.. అంటున్నారు.

Samantha became number one heroine by giving money
Samantha

ఇక స‌మంత క‌ర‌ణ్ జోహార్ షోలో మాట్లాడుతూ.. త‌న భ‌ర్త చైతూను మాజీ భ‌ర్త అని సంబోధించాల‌ని చెప్పింది. దీంతో క‌ర‌ణ్ జోహార్ సారీ కూడా చెప్పారు. అయితే ఇందుకు అక్కినేని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌మంత మ‌రీ విడ్డూరంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని.. కానీ ఆమె గురించి చైతూ మాత్రం చాలా కూల్‌గానే బ‌దులిస్తున్నాడ‌ని.. ఆయ‌న‌కు, ఆమెకు ఎంతో తేడా ఉంద‌ని అంటున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే సమంత బ్యాక్‌ టూ బ్యాక్‌ పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. శాకుంతలం, యశోద, ఖుషితోపాటు తెలుగు, తమిళంలోనూ ఓ బైలింగ్వల్‌ మూవీలో న‌టిస్తోంది. అలాగే హిందీలోకి ఎంట్రీ ఇస్తూ ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ చిత్రానికి ఓకే చెప్పింది. అలాగే అక్షయ్‌ కుమార్‌తోనే మరో సినిమాకి కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైథలాజికల్ స్టోరీగా తెరకెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. దీంతోపాటు మ‌రో అంతర్జాతీయ మూవీలోనూ స‌మంత న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now