Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ ఈ మధ్యే లైగర్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి గాను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తేదీన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే విజయ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక దీంతోపాటు జేజీఎం (జనగణమణ) పేరిట ఓ మూవీని మళ్లీ పూరీతోనే విజయ్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అలాగే సమంతతో కలిసి ఖుషి అనే సినిమాను కూడా విజయ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది.
ఇక ఖుషి సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను కూడా ఇటీవలే లాంచ్ చేశారు. ఇందులో విజయ్, సమంత ఇద్దరూ భిన్నమైన వేషధారణలో కనిపించి ఆశ్చర్య పరిచారు. ఈ మూవీకి మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మజిలీలో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్ మధ్య లిప్ లాక్ తరహా సీన్లు ఉండడంతో ఇప్పుడు ఆయన తీస్తున్న ఖుషిలోనూ అలాంటి సీన్లనే రిపీట్ చేస్తారని అంటున్నారు.
కాగా బాలీవుడ్‌లో కరీనా కపూర్, దీపికా పదుకునె వంటి హీరోయిన్లు వివాహం అయ్యాక కూడా ఇతర హీరోలతో సినిమాల్లో నటిస్తూ లిప్‌లాక్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంతకు కూడా వివాహం అయింది. కానీ విడాకులు తీసుకుంది. అయినప్పటికీ ఆమె ఆ కోవకే చెందుతుంది. కనుక కరీనా, దీపికాల మాదిరిగా సమంత కూడా లిప్‌లాక్‌కు రెడీ అవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.
అయితే విజయ్‌తో లిప్ లాక్ సీన్‌పై ప్రస్తుతం వస్తున్నవన్నీ ఊహాగానాలే. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఒక వేళ దర్శకుడు కావాలని కోరితే అందుకు సమంత ఒప్పుకుంటుందా.. ఆమె విజయ్‌తో లిప్‌లాక్ చేస్తుందా.. అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం సమంత విడాకులు తీసుకుంది.. పైగా అంతులేని గ్లామర్ షో చేస్తోంది. కనుక కాస్త పారితోషికం ఎక్కువ ఇస్తే.. లిప్‌లాక్‌కు కూడా సై అంటుందని అంటున్నారు. మరి ఈ విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…