Bigg Boss : బిగ్ బాస్ లో కూడా సమంత, నాగ చైతన్యల టాపిక్.. విడాకులకు కారణం అదే అంటూ గుసగుసలు..!

September 21, 2022 7:03 PM

Bigg Boss : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న‌ ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.

వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ ఎక్కడ చూసినా వీరి టాపిక్ నడుస్తుంది. వీరిద్దరి విడాకులకు కారణం ఇదే అంటూ రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు వీరిద్దరి టాపిక్ బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వచ్చింది. నాగ చైతన్య, సమంత విడాకుల టాపిక్ గురించి బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకున్నారు. హౌస్‌లోని ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు ఈ టాపిక్ చర్చకు వచ్చిందట. ఈ నలుగురిలో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న ఓ అమ్మాయి మాట్లాడుతూ.. సమంతదే కరెక్ట్ అనగా.. మరొక మేల్ కంటెస్టెంట్ ఈ విషయంలో నాగ చైతన్యని సపోర్ట్ చేశాడ‌ట.

Samantha and Naga Chaitanya topic discussed in Bigg Boss house
Bigg Boss

మిగిలిన ఇద్దరూ మాత్రం ఇది మనకు అనవసరమైన టాపిక్.. ఇలాంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడకూడదు అని వారికి గుర్తు చేశారట. దీంతో వాళ్ళిద్దరూ ఇంతసేపు తప్పుగా మాట్లాడాము అని భావించి సైలెంట్ అయ్యారట. అయితే వెంటనే మా టీవీ యజమాన్యం మాత్రం వీరు మాట్లాడుకున్న వీడియోని డిలీట్ చేశారు అని ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పుకారు మాత్రమేనా లేక ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now