Samantha : ఊ.. అంటావా పాట‌కు స‌మంత మళ్లీ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌..!

July 20, 2022 6:41 PM

Samantha : అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీలో స‌మంత చేసిన ఊ.. అంటావా.. పాట‌కు భారీ స్థాయిలో స్పంద‌న వ‌చ్చింది. చాలా మంది ఈ పాట‌కు ఇప్ప‌టికే స్టెప్పులు వేసి త‌మ స‌ర‌దాను తీర్చుకున్నారు. ఎంతో మంది సెల‌బ్స్ కూడా ఈ పాట‌కు డ్యాన్స్‌లు చేశారు. అయితే తాజాగా మ‌ళ్లీ స‌మంత ఈ పాట‌కు స్టెప్పులేసి అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ఆమె చేసిన డ్యాన్స్ వీడియో మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది. ఇక విష‌యం ఏమిటంటే..

ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌.. ఓ షోను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కాఫీ విత్ క‌ర‌ణ్ అనే షోకు ఈయ‌న హోస్ట్‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం 7వ సీజ‌న్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఈ సీజ‌న్‌కు తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా ర‌ణ‌వీర్ సింగ్, ఆలియా భ‌ట్‌లు వ‌చ్చారు. రెండో ఎపిసోడ్‌కు జాన్వీ క‌పూర్‌, సారా అలీ ఖాన్‌లు గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఇక గురువారం జూలై 21న మూడో ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. దీనికి సమంత‌, అక్ష‌య్ కుమార్‌లు గెస్ట్‌లుగా రాగా.. వీరి ఎపిసోడ్‌కు చెందిన ప్రోమోను లేటెస్ట్‌గా విడుద‌ల చేశారు. ఇందులోనే స‌మంత.. అక్ష‌య్‌తో క‌లిసి ఊ.. అంటావా.. పాట‌కు స్టెప్పులేసి అల‌రించింది. ఇక ఈ ఎపిసోడ్ ను పూర్తిగా చూడాలంటే గురువారం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అయితే ఇందులో స‌మంత క‌ర‌ణ్ జోహార్ వేసే ప్ర‌శ్న‌ల‌కు ఎలా స‌మాధానాలు చెబుతుందా.. అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Samantha again danced for Pushpa movie song
Samantha

ఇక క‌ర‌ణ్ జోహార్ త‌న సొంత బ్యాన‌ర్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ఆధ్వ‌ర్యంలో ద‌ర్శ‌కుడిగా మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈయ‌న తెర‌కెక్కిస్తున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీలో ర‌ణ‌వీర్ సింగ్, ఆలియా భ‌ట్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ 2023లో వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now