Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజే వేరు. పెళ్లైన తర్వాత ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గలేదు. విడాకుల తర్వాత కూడా సమంత క్రేజ్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. వరుస ఆఫర్స్ ఈ అమ్మడిని పలకరిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసిన సమంత త్వరలో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయనుందని సమాచారం. సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలంలో నటించగా.. ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో సమంతని కథానాయికగా తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడు. ఒక్క అనుష్కతోనే రాజమౌళి మూడు సినిమాలు చేశాడు. ఇక గతంలో రాజమౌళి చేసిన ‘ఈగ’ సినిమాలో సామ్ కన్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన నేపథ్యంలో సమంతను తీసుకోవాలని మహేష్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…