Salaar Story : లీకైన ప్రభాస్ సలార్ సినిమా స్టోరీ.. మూవీ ట్విస్ట్స్ చూస్తే మెంటలెక్కిపోద్ది..!

Salaar Story : బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ క్రమంలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ కు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ ఈ టైంలో ప్రభాస్ నుంచి మంచి మాస్ మూవీ వస్తే.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ అదే స్థాయిలో ఉంటుందని అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కెజి.ఫ్ సిరీస్ కు పని చేసిన టీం ఈ చిత్రానికి కూడా పనిచేస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే సలార్ మూవీకి సంబంధించి కొన్ని లీక్డ్ పిక్స్ నెట్టింట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ తన మిత్రుడి ఆశయాలను నెరవేర్చే వాడిగా కనిపించబోతున్నాడట. అతన్ని విలన్స్ కొన్ని కారణాల వాళ్ళ చంపేస్తారట. చనిపోయే ముందు ప్రభాస్ తో అన్ని విషయాలు చెప్పి తన ఆశయాన్ని బ్రతికించమని కోరుతాడట. ఆ స్నేహితుడి పాత్రలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ ఒక జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ప్రభాస్, శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయట.

Salaar Story

ఈ చిత్రం క్లైమాక్స్ లో శృతి హాసన్ చనిపోతుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా కేజీఎఫ్ సిరీస్ లాగానే ఫుల్ యాక్షన్ సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బలంగా ఉన్నాయట. ప్రభాస్ ఫాన్స్ ఆకలి తీర్చే విధంగా ఈ సినిమాలో ప్రతి షాట్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఇది ఇలా ఉండగా హాలీవుడ్ తరహాలో కేజీఎఫ్ కూడా సినిమాటిక్ యూనివర్స్ గా చేసే ఆలోచన ఉన్నట్టు ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేసిన సంగతి తెలిసిందే.

అంటే ఒక సినిమా లింక్ ని మరో సినిమాకి కలపడం. అదే విధంగా సలార్ ప్రపంచంలోకి రాకీ భాయ్ కూడా అడుగుపెడుతాడట. ఈ మూవీకి క్లైమాక్స్ ట్విస్ట్ అదే. రాకీ భాయ్ కి, సలార్ కి లింక్ ఏమిటి అనే ట్విస్ట్ ఫాన్స్, ప్రేక్షకుల మైండ్ బ్లాస్ట్ అయ్యే విధంగా ఉండబోతోంద‌ట. ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ సలార్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM