Sajjanar : శ్రీరామ్ చంద్ర‌కి సజ్జ‌నార్ స‌పోర్ట్‌.. టైటిల్ గెల‌వాలి అంటూ ఎంక‌రేజ్..

November 14, 2021 10:33 AM

Sajjanar : బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. 19 మందితో మొద‌లైన ఈ షోలో ప్ర‌స్తుతం 10 మంది ఉన్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఆయ‌న‌కు ప్రముఖులు కూడా తమ సపోర్ట్ ను ఇస్తున్నారు.

Sajjanar gives support to sri rama chandra

ఇప్పటికే యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ అని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయాలని కోరుతూ  ఓ వీడియో విడుద‌ల చేసింది. ఇక రీసెంట్‌గా రియ‌ల్ హీరో సోనూసూద్ కూడా త‌న స‌పోర్ట్ శ్రీరామ చంద్ర‌కు అని తెలిపాడు.

ఇక తాజాగా ప్ర‌స్తుతం ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్న స‌జ్జ‌నార్ త‌న స‌పోర్ట్ తెలియ‌జేశారు. గేమ్ బాగా ఆడుతున్నావ్, పాటలు బాగా ప‌డుతున్నావ్. నువ్వు టైటిల్ గెలుస్తావ‌నే న‌మ్మ‌కం ఉంద‌ని త‌న బ్లెస్సింగ్ అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రీరామ‌చంద్ర అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ స‌జ్జ‌నార్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మరి ఇంతమంది సెలబ్రిటీల మద్దతు అందుకుంటున్న శ్రీరామచంద్ర బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ విన్నర్‌గా నిలుస్తాడో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now