Pooja Kannan : తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి. నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల సాయి పల్లవి లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో సారంగదరియా పాటకు ఆమె వేసిన డ్యాన్స్ ను అస్సలు మరచిపోలేం. అయితే సాయి పల్లవి తన క్రేజ్‌ని ఉపయోగించుకొని సోదరిని కూడా సినిమాలలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
సాయి పల్లవి సోదరి పూజా కణ్ణన్ అచ్చం అక్కలాగానే ఉంటుంది. అక్కలానే మంచి డ్యాన్సర్ కూడా. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్’.. ఇలా పలు చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా చేసిన స్టంట్ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంతో పూజా ఎంట్రీ ఉందని అన్నారు. కానీ పూజా డెబ్యూ మూవీకి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది.
స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్‌ను వదిలారు. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి మరి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…