గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pooja Kannan : సాయి ప‌ల్ల‌వి సోద‌రి సినిమా కూడా రెడీ అయింది.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు..!

Pooja Kannan : తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న అందాల ముద్దుగుమ్మ సాయి ప‌ల్లవి. నెమ‌లిలా నాట్యం చేస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సులను దోచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల సాయి ప‌ల్ల‌వి…

Pooja Kannan : సాయి ప‌ల్ల‌వి సోద‌రి సినిమా కూడా రెడీ అయింది.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు..!

Pooja Kannan : తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తున్న అందాల ముద్దుగుమ్మ సాయి ప‌ల్లవి. నెమ‌లిలా నాట్యం చేస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సులను దోచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల సాయి ప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇందులో సారంగ‌ద‌రియా పాట‌కు ఆమె వేసిన డ్యాన్స్ ను అస్స‌లు మ‌ర‌చిపోలేం. అయితే సాయి ప‌ల్ల‌వి త‌న క్రేజ్‌ని ఉప‌యోగించుకొని సోద‌రిని కూడా సినిమాల‌లోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Sai Pallavi sister Pooja Kannan entering into film industry

సాయి ప‌ల్ల‌వి సోద‌రి పూజా క‌ణ్ణ‌న్ అచ్చం అక్క‌లాగానే ఉంటుంది. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్‌’.. ఇలా పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసిన స్టంట్‌ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంతో పూజా ఎంట్రీ ఉంద‌ని అన్నారు. కానీ పూజా డెబ్యూ మూవీకి సంబంధించి పూర్తి క్లారిటీ వ‌చ్చింది.

స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్‌ను వదిలారు. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి మ‌రి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి