Sai Pallavi : త‌న కెరీర్‌ను తానే నాశ‌నం చేసుకుంటున్న సాయిప‌ల్ల‌వి..?

July 4, 2022 4:16 PM

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె న‌టిగానే కాక త‌న వ్య‌క్తిత్వం ప‌రంగా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్‌కు చెందిన కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌చారం చేయాల‌ని చెప్పి.. రూ.కోట్లు ఇస్తామ‌ని ఈమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ తాను స‌హ‌జ‌సిద్ధ‌మైన అందాన్నే ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. క‌నుక అలాంటి ప్రొడ‌క్ట్స్‌ను ప్ర‌చారం చేయ‌లేన‌ని చెప్పేసింది. ఇక ఇటీవ‌లే మ‌రో కంపెనీకి చెందిన భారీ ఆఫ‌ర్‌ను కూడా ఈమె సున్నితంగా తిర‌స్క‌రించింది. అయితే సాయిప‌ల్ల‌వికి పెద్ద‌గా ఆఫ‌ర్లు రావ‌డం లేదు. కానీ వ‌చ్చిన వాటిని కూడా ఆమె స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే సినిమాల ఎంపిక‌లోనూ సాయిప‌ల్ల‌వి జాగ్ర‌త్త ప‌డడం లేదని అంటున్నారు.

సాయి ప‌ల్ల‌వి న‌టించిన విరాట ప‌ర్వం మూవీ వాస్త‌వానికి ఈ త‌రం చూసేదికాదు. ఇలాంటి సినిమాల‌ను ఇప్పుడు ప్రేక్ష‌కులు చూడడం లేదు. అలాగే ఈమె న‌టించిన గార్గి అనే మ‌రో మూవీ కూడా త్వ‌ర‌లో రిలీజ్ అవుతోంది. ఇది కోర్టుల నేప‌థ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. ఇందులో కులాలు, వివ‌క్ష మీద చూపిస్తార‌ట‌. అయితే ఇలా సాయి ప‌ల్ల‌వి సినిమా సెలెక్ష‌న్‌లోనూ త‌ప్పు చేస్తుంద‌ని అంటున్నారు. విరాట ప‌ర్వం లాంటి సినిమానే గార్గి అని.. ఈ త‌ర‌హా సినిమాల‌ను ప్రేక్ష‌కులు చూడ‌డం లేద‌ని.. ఈమె సినిమాల ఎంపిక‌పై మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించాల‌ని అంటున్నారు.

Sai Pallavi selection of movies is very wrong says analysts
Sai Pallavi

సాయిప‌ల్ల‌వి ఒక ర‌కంగా ఇలాంటి సినిమాల‌ను చేస్తుండ‌డం ద్వారా త‌న కెరీర్‌ను తానే నాశ‌నం చేసుకుంటుంద‌ని అంటున్నారు. హీరోయిన్లు క‌మ‌ర్షియ‌ల్ ధోర‌ణిలో ఆలోచించాల‌ని.. సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే కెరీర్ ప‌త‌నం అవుతుంద‌ని.. సాయిప‌ల్ల‌వి కెరీర్ ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉంద‌ని.. ఇక‌నైనా జాగ్ర‌త్త‌గా సినిమాల‌ను ఎంపిక చేసుకుని చేయ‌క‌పోతే.. ఆమె కెరీర్ ఇంత‌టితోనే ముగుస్తుంద‌ని అంటున్నారు. ఏది ఏమైనా.. ఒక ర‌కంగా చూస్తే ఇది వాస్త‌వ‌మే అనిపిస్తోంది. సాయిప‌ల్ల‌వి గ్లామ‌ర్ షో చేయ‌డంలో హ‌ద్దులు పెట్టుకుంది. క‌రెక్టే. కానీ సినిమాల విష‌యంలో అయినా స‌రే కాస్త ప‌ట్టు విడుపులు ఉండాలి. లేదంటే తోటి హీరోయిన్ల‌తో ఈ కాలంలో పోటీ ప‌డ‌డం క‌ష్ట‌మే. మ‌రి ముందు ముందు ఆమె ఎలాంటి సినిమాల‌ను చేస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now