Sai Pallavi : అలాంటి పాత్రలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా..!

November 13, 2021 1:18 PM

Sai Pallavi : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిపల్లవి ఆ తర్వాత వరుస తెలుగు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ మంచి కథలను ఎంపిక చేసుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ద్వారా మంచి ఊపులో ఉన్న సాయిపల్లవి ఇకపై తాను ఎంపిక చేసుకునే కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Sai Pallavi says she will act in movies like comedy genre
Sai Pallavi

ఇకపై తాను కామెడీ పాత్రలో కూడా నటించాలని భావిస్తున్నట్లు తెలియజేసింది. మంచి కామెడీతో కథ ప్రధానంగా సాగే కథలు దొరికితే మాత్రం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసింది. మరి ఈమెకు కామెడీ చేసే పాత్రలు ఎప్పుడు వస్తాయో.. అలాంటి పాత్రలలో నటించి మరో సారి తనని తాను ఎప్పుడు నిరూపించుకుంటుందో.. వేచి చూడాలి.

ప్రస్తుతం సాయిపల్లవి సినిమాల విషయానికి వస్తే ఈమె నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. ఇదివరకే నాని సరసన ఎంసీఏ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్న సాయి పల్లవి మరోసారి నాని సరసన నటించి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాలకు కూడా సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now