Sai Pallavi : సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు.
ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి థియేటర్ లో కలెక్టన్స్ రాబట్ట లేకపోయినా.. పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు నుంచి సాయి పల్లవి కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీను రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి. కానీ ఈసారి మాత్రం సాయి పల్లవి తప్పు చేసిందనే చెప్పాలి.
ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ఓ యంగ్ డైరెక్టర్ సాయి పల్లవిని మీట్ అయితే ఈ అమ్మడు సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అలాగని సినిమాలో వల్గర్ సీన్స్ లేవు.. సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్ అంటా.. అయినా కూడా సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..? ఈ మధ్యకాలంలో సాయి పల్లవి నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వచ్చాయి. దీంతో సాయి పల్లవి ఇక సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
తన మనసు చంపుకుని ఇష్టం లేని సినిమాల్లో నటించనని.. అలా అని నా పద్ధతులతో నిర్మాతలకు నష్టం తీసుకురావడం ఇష్టం లేదు అంటూ.. తన దగ్గరకు వచ్చిన మంచి స్టోరీని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. అంతే కాదు ఆ డైరెక్టర్ తో.. మీరు నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి చాలా థాంక్స్. కానీ నేను ఇకపై సినిమాలలో నటించాలి అనుకోవడం లేదు అంటూ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు ఆఫర్ చేశారట. అయినప్పటికీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది. ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…