Sai Pallavi : సగం షూటింగ్ అయ్యాక లిప్ లాక్ అని ఒత్తిడి చేసిన డైరెక్టర్.. చివరకు సాయి పల్లవి ఏం చేసిందంటే..?

October 17, 2022 9:45 PM

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి థియేటర్ లో కలెక్టన్స్ రాబట్ట లేకపోయినా.. పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.

ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకుంది. న్యూస్ 18 కథనం ప్రకారం.. ఓ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లేవని ఒప్పుకోవడంతో, సినిమా సగం షూట్ చేసాక లిప్ లాక్ సీన్ చేయాలంటూ సదరు దర్శకుడు సాయి పల్లవిపై ఒత్తిడి తీసుకువచ్చాడట. అయితే సాయి పల్లవి అందుకు ససేమిరా అందట. అలాంటి సీన్లలో చేయను అని ముందే చెప్పాను కదా అని సాయి పల్లవి వాదించిందట. ఈ సమయంలో ఆ సినిమా హీరో కలుగ చేసుకుని ఆమెను ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కించాడట.

Sai Pallavi explained about a problem she face while film making
Sai Pallavi

ఆమె చేయను అంటోంది కదా.. ఎందుకు ఒత్తిడి చేస్తారు. ఆమె వద్దు అనుకుంటున్నపుడు వదిలేయమని డైరెక్టర్ కు సలహా ఇచ్చాడట. మళ్లీ ఆమె మీటూ పేరిట బయట చెబితే అందరం ఇబ్బందుల్లో పడతాం అని చెప్పుకొచ్చాడట. దీంతో కన్విన్స్ అయిన డైరెక్టర్ సాయి పల్లవిని ఇక ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. రొమాన్స్ అనే కాదు.. అన్ని విషయాల్లోనూ సాయి పల్లవి తన పరిధి మేరకే ప్రవర్తిస్తుంది. తన కుటుంబ సభ్యులు తన సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలగాలి అని సాయి పల్లవి భావిస్తుంది. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ హైబ్రిడ్ పిల్లా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now