Sai Dharam Tej : రెండు నెల‌ల్లో షూటింగ్‌కు సాయి తేజ్.. గుడ్ న్యూస్ చెప్పిన నాగ‌బాబు..

October 8, 2021 3:32 PM

Sai Dharam Tej : మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ.. అదుపు త‌ప్పి కింద ప‌డ్డ విష‌యం తెలిసిందే. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌‌కు షిఫ్ట్ చేశారు. కాలర్ బోన్ విరగ‌డంతో అపోలో బృందం విజ‌యవంతంగా స‌ర్జ‌రీ నిర్వ‌హించింది. కొద్ది రోజులుగా తేజ్ ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Sai Dharam Tej is ok may do film shooting in 2 months says nagababu

తేజ్ ఆరోగ్యంపై అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు. ప‌లు మీడియా సంస్థ‌లు కూడా సాయి తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నాగ‌బాబు ఓ ఛానల్ ఇంట‌ర్వ్యూలో సాయి ధ‌ర‌మ్ ఆరోగ్యంపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ జరుగుతోంది. మరో 30-45 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడు. అతను రెండు నెలల్లో షూటింగ్‌లకు కూడా హాజరు కావచ్చు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము” అని నాగబాబు అన్నారు.

రీసెంట్‌గా సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపిస్తూ ట్వీట్ చేశారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి ‘థాంక్స్’ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ ముగించాడు. కాగా సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్‌ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now