Sai Dharam Tej : మెగా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇంటికి..!

October 15, 2021 9:59 AM

Sai Dharam Tej : ద‌స‌రా పండుగ రోజు మెగా ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్ న్యూసే అని చెప్ప‌వ‌చ్చు. ఎన్నో రోజుల నుంచి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎట్ట‌కేల‌కు ఇంటికి చేరుకుంటున్నారు. మాదాపూర్ దుర్గం చెరువు కేబ‌ల్ బ్రిడ్జిపై బైక్ యాక్సిడెంట్‌కు గురైన సాయిధ‌ర‌మ్ తేజ్‌కు కాల‌ర్ బోన్ శ‌స్త్ర చికిత్స చేశారు. త‌రువాత కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడు. అయితే ఎట్ట‌కేల‌కు పూర్తిగా కోలుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ను అపోలో వైద్యులు ఇంటికి పంపిస్తున్నారు.

Sai Dharam Tej  discharging from hospital

ద‌స‌రా పండుగ రోజు సాయి ధ‌ర‌మ్ తేజ్ డిశ్చార్జి అవుతుండ‌డం మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ బ‌ర్త్ డే కూడా ఇదే రోజు కావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోతున్నాయి. హాస్పిట‌ల్‌లో విష‌మ స్థితిలో చికిత్స పొందిన సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవుతుండ‌డం మెగా ఫ్యామిలీకి కూడా ఆనందాన్నిస్తోంది.

అయితే సాయిధ‌ర‌మ్ తేజ్ హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడే ఆయ‌న సినిమా రిప‌బ్లిక్ విడుద‌ల అయింది. విమ‌ర్శ‌కుల నుంచి కూడా ఈ మూవీ ప్రశంస‌ల‌ను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ అయి ఉండ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని, రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నా ప్రేక్ష‌కులు సినిమాను చూసేందుకు ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని అర్థ‌మైంది. అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ మాత్రం ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వ‌స్తుండ‌డం.. నిజంగా హ్యాపీ న్యూసే అని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now