Sai Dharam Tej : యాక్సిడెంట్ త‌ర్వాత తొలిసారి అభిమానుల ముందుకు రాబోతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్

November 23, 2021 9:24 PM

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ వినాయ‌క చ‌వితి రోజు యాక్సిడెంట్‌కు గురైన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన అప్పటినుంచి 35 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అపోలో వైద్యులు ఆయనకు మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తూ అనుక్షణం పర్య‌వేక్షించారు. ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందించ‌డంతో తేజూ కోలుకున్నాడు. దీపావ‌ళి రోజు మెగా ఫ్యామిలీతో క‌లిసి ఫొటో దిగగా అందులో చాలా డిఫరెంట్ లుక్‌లో క‌నిపించాడు.

Sai Dharam Tej coming before fans after so many days

రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. తేజ్‌కి సంబంధించిన ఒక‌ట్రెండు ఫొటోలు వ‌చ్చాయి గానీ, అవి కుటుంబ స‌భ్యులు విడుద‌ల చేసిన‌వే. అయితే ప్ర‌మ‌దం త‌ర‌వాత తొలిసారి తేజ్.. మీడియాకు క‌నిపించ‌నున్నాడు. రిప‌బ్లిక్ సినిమా శాటిలైట్, ఓటీటీ హ‌క్కుల్ని జీ 5 సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రిప‌బ్లిక్ ప్రీమియ‌ర్స్‌కి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ నిర్వ‌హించ‌బోతోంది జీ5 టీమ్‌.

ఈ ప్రెస్ మీట్‌లో చిత్ర‌బృందం పాల్గొన‌బోతోంది. వారితో పాటుతేజ్ కూడా రానున్నాడు. ప్ర‌మాదం కార‌ణంగా రిప‌బ్లిక్ ప్ర‌మోష‌న్ల‌కు దూరం అయ్యాడు తేజ్. రిప‌బ్లిక్ కి సంబంధించిన ఒక్క ఈవెంట్ లో కూడా తేజ్ లేడు. కాబ‌ట్టి.. ఈసారి తేజ్ ని తీసుకురావాల‌నుకుంది చిత్ర‌బృందం. అయితే అస‌లు ప్ర‌మాదం ఎలా జ‌రిగింది ? అన్న‌ది తేజ్ చెబితే గానీ స్ప‌ష్ట‌త రాదు. ప‌లు విష‌యాల‌పై తేజ్ క్లారిటీ ఇవ్వనున్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now