Saami Saami Song : సామీ సామీ పాట కోసం రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్.. ఆమె ఎవరు తెలుసా ?

November 19, 2021 11:26 PM

Saami Saami Song : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బ‌న్నీని ర‌ష్మిక సామి.. అని పిలిస్తే.. ర‌ష్మిక‌ను బ‌న్నీ.. అమ్మి అని పిలిచేవాడు. అది కూడా చిత్తూరు జిల్లా యాస‌లో. ఎందుకంటే పుష్ప సినిమా చిత్తూరు జిల్లాలో జ‌రిగే శేషాచ‌ల అడ‌వుల్లోని ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది కాబ‌ట్టి. అయితే వారి పేర్ల‌తో రాక్ స్టార్ దేవి శ్రీ సామి సామి అనే సాంగ్ ప్లాన్ చేయ‌గా, ఇది విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందింది.

Saami Saami Song that actress sold two bangles for that song know who she is

సామీ సామీ పాటకు భారీ స్పందన వస్తున్న నేప‌థ్యంలో పలువురు వ్యక్తులు ఈ పాటకు కవర్ సాంగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ రేఖా భోజ్ దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఈ సాంగ్ రిచ్‌గా ఉండాలని, ఒరిజినల్ సాంగ్‌ని తలదన్నేలా ఉండాలని ఎంతో కష్టపడింది. ఏకంగా ఈ సాంగ్ కోసం ఆమె రెండు బంగారు గాజులు అమ్ముకుందంటే ఆ డెడికేషన్ ను అర్థం చేసుకోవచ్చు.

అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే లేదు.. అంటూ దూసుకుపోతున్న ఈ విశాఖ బ్యూటీ.. అవకాశాలు లేకపోయినా, వేషాలు రాకపోయినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోంది. వైజాగ్‌లో ఓ స్టుడియో స్టార్ట్ చేసిన రేఖా భోజ్.. పలు హాట్ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ సినిమాలోని సామీ సామీ పాటను కవర్ సాంగ్ గా చేసింది ఈ వైజాగ్ చిన్నది.

ఒరిజిన‌ల్ సాంగ్ మాదిరిగా రేఖ క‌వర్ సాంగ్ ట్రై చేయ‌గా, దానికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సాంగ్ షూట్ చేస్తున్నపుడు వర్షం పడినా కూడా లెక్క చేయకుండా చేశారట. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం కోరుకుంటూ సపోర్ట్ చేయండని సోషల్ మీడియా వేదికగా వేడుకుంది రేఖా భోజ్. ‘చాలా కష్టపడి చేశాను.. రెండు గాజులు అమ్ముకున్నా.. మీకు నచ్చితే మీ సోషల్ మీడియా ఖాతాలలో ఒక్క షేర్ చేసి సపోర్ట్ అందించండి” అని ఆమె పోస్ట్ పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now