Saamanyudu Movie Review : విశాల్ న‌టించిన సామాన్యుడు మూవీ రివ్యూ..!

Saamanyudu Movie Review : తెలుగు తెర‌కు విశాల్ బాగా ప‌రిచ‌య‌మే. ఈయ‌న న‌టించిన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తుంటారు. గతంలో ఈయ‌న న‌టించిన ప‌లు చిత్రాలు తెలుగులోనూ హిట్ అయ్యాయి. ఇక ఈ వారం విశాల్ సామాన్యుడు మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..!

Saamanyudu Movie Review

క‌థ‌..

పోర‌స్ (విశాల్‌) ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వ్య‌క్తి. పోలీసు కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. త‌న తండ్రి పోలీస్‌గా ప‌నిచేస్తుంటాడు. అయితే ఆయ‌న త‌న ఉన్న‌తాధికారుల ఆర్డ‌ర్స్‌ను క‌చ్చితంగా ఫాలో అవుతుంటాడు. ధ‌నికుల‌ను అరెస్టు చేసేందుకు భ‌య‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో ఒక రోజు అక‌స్మాత్తుగా పోర‌స్ సోద‌రి ద్వార‌క (ర‌వీనా ర‌వి) ని ఎవ‌రో చంపేస్తారు. దీంతో పోర‌స్ త‌న సోద‌రిని చంపిన వారి కోసం వెదుకుతుంటాడు. ఇక మ‌రోవైపు అన్వ‌ర్ (బాబురాజ్‌) ఎంపీ కావాల‌నుకుంటాడు. కానీ అత‌న్ని ప‌రిశుద్ధం (కుమ‌ర‌వెల్‌) అడ్డుకుంటాడు. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ద్వార‌క‌ను చంపింది ఎవ‌రు ? దోషిని పోర‌స్ ప‌ట్టుకున్నాడా ? ద్వార‌క‌కు ఓ ధ‌నిక వ్య‌క్తికి సంబంధం ఏమిటి ? ప‌ఓర‌స్ పోలీస్ అయ్యాడా ? వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

ఈ మూవీలో విశాల్ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తి హీరోయిన్‌గా న‌టించింది. యోగి బాబు, బాబురాజ్ జాకోబ్‌, పీఏ తుల‌సి, ర‌వీనా ర‌విలు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అందరూ త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర బాగానే న‌టించారు. విశాల్ సినిమాలు అంటే స‌హ‌జంగానే యాక్ష‌న్‌కు పెద్ద పీట వేస్తారు. ఇందులోనూ ప‌లు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూడ‌వ‌చ్చు. అవి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. విశాల్ ఈ మూవీలో మ‌రోసారి చ‌క్క‌ని పెర్ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.

డింపుల్ హ‌య‌తి ఫ‌ర్వాలేద‌నిపించింది. విశాల్ సోద‌రిగా ర‌వీనా ర‌వి న‌ట‌న బాగుంది. మిగిలిన న‌టీన‌టులు కూడా బాగానే న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ ఆక‌ట్టుకుంటుంది. సినిమాకు ప్ర‌ధాన బ‌లం స్క్రీన్ ప్లే అని చెప్ప‌వ‌చ్చు.

ఈ సినిమాకు చెందిన క‌థ‌, స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా.. క‌థ‌ను మ‌రీ నెమ్మ‌దిగా చెబుతారు. దీంతో ఓపిగ్గా చూడాల్సి వ‌స్తుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో చాలా స్లోగా సాగుతుంది. కానీ స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్టాఫ్‌లో కొన్ని అవ‌స‌రం లేని స‌న్నివేశాల‌ను జోడించారు. ఈ మూవీ ర‌న్ టైమ్ కూడా ఎక్కువే.

ద‌ర్శ‌కుడు తు పా శ‌ర‌వ‌న‌న్ సామాన్యుడుకు స్టోరీని అందించారు. మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకుని ఆయ‌న క‌థ ఇచ్చారు. ఫైట్ స‌న్నివేశాలు బాగుంటాయి. కెవిన్ రాజ్ విజువ‌ల్స్ కూడా అల‌రిస్తాయి. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే.. విశాల్ ఈ మూవీలో మ‌రోమారు ప‌వ‌ర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని చెప్ప‌వ‌చ్చు. యోగిబాబు కామెడీ కూడా ఆక‌ట్టుకుంటుంది. చివ‌ర్లో స‌స్పెన్స్ ఉత్కంఠ‌ను క‌లిగిస్తుంది. ఇక మొత్తంగా చెప్పాలంటే.. విశాల్ సామాన్యుడు మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌నే చెప్ప‌వచ్చు. యాక్ష‌న్‌, కామెడీ, స‌స్పెన్స్ కోరుకునే వారు ఈ మూవీని ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM