Heroines : రష్మిక మందన్న, సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇలా హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

Heroines : తెలుగు తెరపై రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం పలు ఇతర భాషల చిత్రాల్లోనూ నటిస్తూ పాపులర్‌ అయ్యారు. కొందరు టాలీవుడ్‌ కు దూరమైన ఇతర భాషల చిత్రాల్లోనే నటిస్తుండగా.. కొందరికి అవకాశాలు రావడం లేదు. కొందరు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో, వారి ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

Heroines

అరుంధతి చిత్రం ద్వారా ఎంతో పాపులర్‌ అయిన నటి అనుష్క శెట్టి బాహుబలి మూవీతో అలరించింది. ఈమెకు ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. ఈమె బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌లో బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) పూర్తి చేసింది.

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరుపొందిన నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్‌ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈమె తిరువల్లలోని మర్తోమా కాలేజీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది.

పుష్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి రష్మిక మందన్న. ఈమె పుష్ప రెండో పార్ట్‌తోపాటు పలు బాలీవుడ్‌ మూవీల్లోనూ ప్రస్తుతం నటిస్తోంది. ఈమె కొడగులోని కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేయగా.. ఎంఎస్‌ రామయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ అండ్‌ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లిష్‌ లిటరేచర్‌లలో నాలుగేళ్ల సర్టిఫికేషన్‌ విద్యను పూర్తి చేసింది.

పుష్ప సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ ద్వారా పాపులర్‌ అయిన సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలో ఈమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక సమంత చెన్నైలోని హోలీ ఏంజల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అలాగే చెన్నైలోని స్టెల్లా మేరీస్‌ కాలేజ్‌లో కామర్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని సాధించింది. ఫిలిం మేకర్‌ రవి వర్మన్‌ సహాయంతో ఈమె తన యాక్టింగ్‌ కెరీర్‌ను ప్రారంభించింది.

తాప్సీ ఢిల్లీలో పుట్టి పెరిగింది. గురు తెగ్‌ బహదూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఈమె కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించింది.

పూజా హెగ్డె ముంబైలో పుట్టి పెరిగింది. ఈమె అక్కడి ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్‌లో పీజీ చేసింది. 2010లో మిస్ యూనివర్స్‌ ఇండియా కాంపిటీషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2012లో సినిమా కెరీర్‌ను ప్రారంభించింది.

కాజల్‌ అగర్వాల్‌ కిషిన్‌ చంద్‌ చెల్లారం కాలేజ్‌లో మాస్‌ మీడియా, మార్కెటింగ్‌, అడ్వర్టయిజింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఎంబీఏ చదవాలని ఈమె ప్రస్తుతం ఆలోచిస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ న్యూఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పరిధిలో ఉన్న జీసస్‌ అండ్‌ మేరీ కాలేజ్‌లో ఈమె మాథ్స్‌లో హానర్స్‌ డిగ్రీని పూర్తి చేసింది.

తమన్నా ముంబైలోని మానెక్‌జీ కూపర్‌ ఎడ్యుకేషణ్‌ ట్రస్ట్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను చదివింది. ముంబైలోని నేషనల్‌ కాలేజ్‌లో డిస్టన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా ఆర్ట్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది.

కీర్తి సురేష్‌ చెన్నైలో జన్మించింది. పెరల్‌ అకాడమీలో ఈమె ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. స్కాట్లండ్‌లో ఎక్స్‌ఛేంజ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైంది. లండన్‌లో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM