RRR : ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆ సీన్ కాపీనా.. ఈసారి కూడా దొరికిపోయిన రాజ‌మౌళి..?

RRR : దర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా అంటే చాలు.. మినిమం ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఆ స్థాయిలో ఆయ‌న సినిమాల‌ను తెర‌కెక్కిస్తుంటారు. గ‌తంలో ఆయన తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అయితే హాలీవుడ్ మూవీల‌లో ఉండే సీన్ల‌ను రాజ‌మౌళి కాపీ కొడతారంటూ ఆయ‌న‌పై ఒక అప‌వాదు ఎప్ప‌టి నుంచో ఉంది. గ‌తంలో ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల్లోని కొన్ని సీన్ల‌ను ఇత‌ర హాలీవుడ్ మూవీల‌లోని సీన్ల‌తో పోలుస్తూ కొంద‌రు ఆయ‌నను విమ‌ర్శించారు. ఇప్ప‌టికీ అలా చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల కావ‌డంతో ఇందులో కూడా అలా హాలీవుడ్ సినిమాల్లోంచి కాపీ కొట్టిన సీన్లు ఏమైనా ఉన్నాయా.. అని కొంద‌రు శూల‌శోధ‌న చేశారు. ఈ క్ర‌మంలోనే ఒక సీన్ మాత్రం అలా కాపీ కొట్టిందేన‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది.

RRR

ఇంగ్లిష్‌లో గ‌తంలో వ‌చ్చిన అద్భుత‌మైన సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ సిరీస్‌లో అనేక క్యారెక్ట‌ర్లు ఉంటాయి. వాటిల్లో హీరో క్యారెక్ట‌ర్ జాన్ స్నో ఒక‌టి. ది బ్యాటిల్ ఆఫ్ బాస్ట‌ర్డ్స్ అనే యుద్ధంలో హీరో శత్రు రాజ్యానికి చెందిన సైనికుల‌ను చీల్చి చండాడుతూ ఉంటాడు. ఓ ద‌శలో శ‌త్రు సైనికులు జాన్ స్నోను ముట్టడిస్తారు. అయిన‌ప్ప‌టికీ జాన్ మాత్రం వారితో పోరాటం చేస్తూనే ఉంటాడు. చివ‌ర‌కు మిత్ర రాజ్యానికి చెందిన రాజులు వ‌చ్చి యుద్ధంలో పాల్గొంటారు. దీంతో జాన్ స్నో బ‌తికిపోతాడు.

అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఉన్న ఆ సీన్‌.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చ‌ర‌ణ్ ఇంట్రో సీన్‌ను పోలి ఉంటుంది. వాస్త‌వానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వ‌చ్చి చాన్నాళ్లు అవుతోంది. పైగా రాజ‌మౌళి ఆ సిరీస్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. అందువ‌ల్లే అందులోని యుద్ధం సీన్‌ను కాపీ చేసి రామ్ చ‌ర‌ణ్ ఇంట్రోను ఆ విధంగా తీశార‌ని.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జాన్ కూడా త‌న శ‌త్రు సైనికుల‌ను అలాగే ఒక‌రి వెంట మ‌రొక‌రిని చంపుతుంటాడు. ఇక ఆర్ఆర్ఆర్‌లో రామ‌రాజు క్యారెక్ట‌ర్ కూడా నిర‌స‌న కారులు ఒక‌రి త‌రువాత మ‌రొక‌రిని త‌ప్పించుకుంటూ ముందుకు సాగుతాడు. పోల్చి చూస్తే ఆ సిరీస్‌.. ఈ సినిమాలోని రెండు సీన్లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అందుక‌నే రాజ‌మౌళి ఈసారి కూడా కాపీ కొట్టి దొరికిపోయార‌ని.. ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. అయితే రాజ‌మౌళికి మాత్రం అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM