RRR Movie : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ గా, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ఫస్ట్ నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి మొదట్నుండీ ఏదో ఒక అప్‌డేట్ బయటకు వస్తూనే ఉంది. అలాగే అభిమానుల డౌట్స్ ని కూడా ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరయోధులైన పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక రీసెంట్ గా రాజమౌళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి సమాచారం తెలియజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన డౌట్ కి ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోది.
ఈ డౌట్ ప్రకారం.. 1920 లో ఇంటి నుండి వెళ్ళిపోయి రెండేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకున్నారని, కాబట్టి ఈ రెండేళ్ళల్లో ఏం జరిగిందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్ ని ఫిక్షన్ గా తెరకెక్కించాలని.. కానీ మనకు తెలిసిన స్టోరీని కూడా మళ్ళీ సినిమాలో చూపిస్తున్నారా.. తెలిసిన స్టోరీనే మార్చి చూపిస్తున్నారా.. అనేది డౌట్.. అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు.
ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చింది ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్. ఈ ట్వీట్ లో.. ‘ ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసి హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…