RRR Movie : ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ స్ట్రాంగ్ రిప్లై..!

November 10, 2021 12:46 PM

RRR Movie : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ గా, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ఫస్ట్ నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి మొదట్నుండీ ఏదో ఒక అప్‌డేట్‌ బయటకు వస్తూనే ఉంది. అలాగే అభిమానుల డౌట్స్ ని కూడా ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరయోధులైన పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న విషయం తెలిసిందే.

RRR Movie team replied to netizen who asked silly question

ఇక రీసెంట్ గా రాజమౌళి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి సమాచారం తెలియజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన డౌట్ కి ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోది.

ఈ డౌట్ ప్రకారం.. 1920 లో ఇంటి నుండి వెళ్ళిపోయి రెండేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకున్నారని, కాబట్టి ఈ రెండేళ్ళల్లో ఏం జరిగిందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్ ని ఫిక్షన్ గా తెరకెక్కించాలని.. కానీ మనకు తెలిసిన స్టోరీని కూడా మళ్ళీ సినిమాలో చూపిస్తున్నారా.. తెలిసిన స్టోరీనే మార్చి చూపిస్తున్నారా.. అనేది డౌట్.. అంటూ ఆ నెటిజన్ ప్రశ్నించారు.

ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చింది ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్. ఈ ట్వీట్ లో.. ‘ ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసి హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now