Natu Natu Song : నాటు నాటు సాంగ్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌..!

November 17, 2021 1:23 PM

Natu Natu Song : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీని పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌న్‌, ఆలియాభ‌ట్‌లు కూడా న‌టిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఇటు దక్షిణాదిలోనే కాక అటు ఉత్త‌రాదిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

rrr movie team big hopes on Natu Natu Song

బాహుబ‌లితో ఒక రేంజ్ సెట్ చేసిన రాజ‌మౌళి సినిమా అనే స‌రికి నార్త్ ఇండియా వారు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి విడుద‌లైన ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ టీజ‌ర్‌లు కేవ‌లం సౌత్‌లోనే ఆక‌ట్టుకున్నాయి. అవి పెద్ద‌గా వైర‌ల్ కాలేదు. కానీ తాజాగా విడుద‌ల చేసిన నాటు నాటు సాంగ్ నార్త్ లోనూ చాలా మందిని తెగ ఆకట్టుకుంటోంది.

ప్ర‌స్తుతం నాటు నాటు సాంగ్‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌స్తోంది. ఈ సాంగ్ ఆలిండ‌యా లెవ‌ల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఈ సాంగ్ మీద చిత్ర యూనిట్ భారీ ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా ప‌బ్లిక్‌లోకి బాగా వెళ్లాలంటే.. ముందుగానే ఇలా టీజ‌ర్ లేదా ట్రైల‌ర్ లేదా సాంగ్స్ వైర‌ల్ కావాలి. ఆ విష‌యంలో నాటు నాటు సాంగ్ స‌క్సెస్ అయింది. దీంతో ఈ మూవీకి ఇంకా ఎక్కువ ప్ర‌చారం ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే నార్త్‌లో ఇంకా చాలా మందికి ఈ మూవీపై అంచ‌నాలు ఇంకా పెరిగాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

అయితే అంతా బాగానే ఉంది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తుందోన‌ని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. నిజానికి గ‌త రాజ‌మౌళి సినిమాలు వేరు, ఇది వేరు. పూర్తిగా భిన్న‌మైన క‌థాంశంతో ఈ మూవీని తీశారు. మరి ఈ మూవీ ఏ మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now