RRR Movie : డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనూ స్ట్రీమ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ..!

July 26, 2022 2:26 PM

RRR Movie : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత‌మైన మూవీల్లో ఆర్ఆర్ఆర్ ఒక‌టి. ఈ మూవీ ఇటీవ‌లే రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను తిర‌గరాస్తోంది. 60కి పైగా దేశాల్లో ఈ మూవీ ప్ర‌ద‌ర్శితం అవుతోంది. దీంతో ఈ మూవీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇందులో తార‌క్‌, చ‌ర‌ణ్‌ల పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అలాగే ఇత‌ర న‌టీనటులు కూడా అద్భుతంగా న‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ హాలీవుడ్ సెల‌బ్రిటీల ప్ర‌శంస‌ల‌ను సైతం ద‌క్కించుకుంటోంది.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్ప‌టికే ఓటీటీల్లోకి వ‌చ్చేసింది. ఈ మూవీకి చెందిన హిందీ వెర్ష‌న్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం చేస్తుండ‌గా.. తెలుగు, ఇత‌ర భాష‌ల‌కు చెందిన వెర్ష‌న్లు జీ5లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూవీకి గాను అన్ని భాష‌ల‌కు చెందిన హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ తాజాగా కొనుగోలు చేసింది. దీంతో హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మూవీని ప్ర‌స్తుతం వీక్షించ‌వ‌చ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం ఈ రేస్‌లో వెనుక‌బ‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు. కొత్త సినిమాల‌ను కొనుగోలు చేయ‌డంలో అమెజాన్ ప్రైమ్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. కానీ ఆర్ఆర్ఆర్‌ను ఎలా మిస్ అయ్యారు.. అన్న విష‌యం మాత్రం అర్థం కావ‌డం లేదు. ఇక మొత్తం 3 ఓటీటీల్లో ఈ మూవీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ క్ర‌మంలోనే ఓటీటీల్లోనూ ఈ మూవీ రికార్డుల‌ను సృష్టిస్తోంది.

RRR Movie now streaming on Disney Plus Hotstar
RRR Movie

కాగా రాజమౌళి ప్ర‌స్తుతం మ‌హేష్ తో చేయ‌బోయే సినిమాకు గాను త‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో క‌లిసి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇటీవ‌లే విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ విష‌యంపై మాట్లాడుతూ.. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ డ్రామాగా మ‌హేష్ మూవీ ఉంటుంద‌ని చెప్పారు. దీంతో మ‌హేష్ అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కుల్లోనూ ఈ మూవీపై ఇప్పుడే భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ మూవీ షూటింగ్ వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు అన్ని ప‌నుల‌ను ముగించుకోనున్నార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now