RRR Movie : నాటు నాటు సాంగ్.. చంద్రబోస్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..!

November 13, 2021 2:26 PM

RRR Movie : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాటు నాటు వీర నాటు సాంగ్ రిలీజై యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇందులో చరణ్, తారక్ పోటీపడి మరీ డాన్స్ చేయడంతో నెట్టింట్లో ఈ పాట దుమ్ము లేపుతోంది.

RRR Movie  netizen trolling chandra bose for using incorrect words

సోషల్ మీడియాలో ఈ పాట ఎంతగా ట్రెండ్ అవుతుందో అదేవిధంగా రచయిత చంద్రబోస్ ను నెటిజన్లు అంతే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి అంటూ నెటిజన్లు అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

పశువుల దాణాక్కూడా పనికిరాని ఎర్రజొన్నలతో రొట్టెలు.. పైగా అందులో మిరపతొక్క.. అదేవిధంగా కీసు పిట్ట కూసినట్టు అంటూ రాశారు.. కీసు పిట్ట అంటే విజిల్.. అనే కదా అర్థం.. విజిల్ ఎలా కూస్తుంది.. అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఏదైనా ఒక పదాన్ని అనువదించే ముందు దాని అర్థం పరమార్థం తెలుసుకొని రాయాలి కానీ.. ఇలా ఏది పడితే అది రాయడం ఏంటి చంద్రబోసు.. అంటూ నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో వేల పాటలు రాసిన మీరు ఇలాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే ఎలా.. అని సోషల్ మీడియా వేదికగా చంద్రబోస్ కి నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now