RRR Movie : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ.. సిద్ధంగా ఉండండి..!

April 21, 2022 4:41 PM

RRR Movie : ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన మూవీ.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించింది. విడుద‌లైన అన్ని చోట్లా భారీ స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీకి రూ.1000 కోట్ల‌కు పైగానే వచ్చాయి. సినిమాకు రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఈ క్ర‌మంలోనే మ‌రికొన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ హ‌వా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇందులో అల్లూరి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌గా.. ఎన్‌టీఆర్ భీమ్ పాత్ర‌లో అలరించారు. ఈ ఇద్ద‌రి న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

RRR Movie may stream on OTT apps in June first week
RRR Movie

ఇక ఆర్ఆర్ఆర్ మేనియా ఇంకా కొన్ని రోజులు కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది. కానీ ఓటీటీ రిలీజ్ మాత్రం కాస్త ఆల‌స్యం అయ్యేట్లు క‌నిపిస్తోంది. అన్ని సినిమాల్లాగే అయితే ఇంకో నాలుగు రోజుల్లో ఈ మూవీ ఓటీటీల్లోకి వ‌చ్చి ఉండాల్సింది. కానీ సినిమా హిట్ కావ‌డంతో ఓటీటీలోకి రావ‌డం ఆల‌స్యం కానుంది. అయితే ఇంకో నెల రోజులు ఓపిక ప‌డితే చాలు.. ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో వీక్షించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఈ మూవీకి గాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాష‌ల‌కు చెందిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక హిందీ, విదేశీ భాషల హ‌క్కుల‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ రెండు యాప్‌ల‌లోనూ ఆర్ఆర్ఆర్ మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇక ఈ మూవీని జూన్‌ 3 నుంచి జీ5లో స్ట్రీమ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఇది సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సమాచార‌మే. ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. క‌నుక ఆర్ఆర్ఆర్ మూవీ అస‌లు ఎప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందో ఇంకా తెలియ‌డం లేదు. కానీ జూన్ మొద‌టి వారంలో స్ట్రీమ్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక దీనిపై త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now