RRR Movie : మెగా, నంద‌మూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త‌.. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు..!

October 7, 2022 7:49 AM

RRR Movie : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా న‌టించారు. ఇందులో రామ్ చర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా న‌టించి ప్రేక్షకులను అల‌రించారు. అలాగే ఆలియా భ‌ట్‌, అజయ్ దేవ‌గ‌న్‌, శ్రియ, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. ఎంఎం కీర‌వాణి అందించిన సంగీతం ఈ సినిమాకు మ‌రో మెయిన్ హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసి రూ.1200 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. విదేశీ ఫిలిం మేకర్స్ కూడా ఈ చిత్రంలో హీరోల ఇద్దరి నటనకు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుల రేసులోకి మ‌న దేశం బ‌రిలోకి నిలుస్తుంద‌ని ఫ్యాన్స్‌తోపాటు ఇతర ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అంద‌రికీ షాకిచ్చింది. గుజ‌రాతీ మూవీ చెల్లో షోను మ‌న దేశం త‌ర‌పున అత్యున్నత స్థాయి గుర్తింపు ఆస్కార్ బ‌రిలోకి దింపింది. మ‌న‌వాళ్లు మాత్రం ఈ విషయం ప‌ట్టించుకోలేదు. కానీ అమెరికన్స్ మాత్రం ఆర్ఆర్ఆర్ మూవీని త‌మ సినిమాగా భావించారు. యూఎస్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఆస్కార్ అవార్డుల‌కు ఆర్ఆర్ఆర్‌ను పంప‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఫ‌ర్ యువ‌ర్ క‌న్‌సిడ‌రేష‌న్ కింద ప్ర‌జ‌ల్లోకి ఆర్ఆర్ఆర్‌ను తీసుకెళుతుంది. స్పెష‌ల్ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్‌ చిత్రానికి ప్రేక్షకులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌వుతున్నారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

RRR Movie hard work going on for oscar campaign
RRR Movie

ఫ‌ర్ యువ‌ర్ క‌న్‌సిడ‌రేష‌న్ క్యాంపెయిన్‌లో భాగంగా ఆర్ఆర్ఆర్‌ను ప‌లు విభాగాల‌కు ఇండిపెండెంట్‌గా పంప‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ, బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ కేట‌గిరీ ఇలా ఏకంగా 15 అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్ బ‌రిలోకి పంప‌డానికి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫ‌ర్ యువ‌ర్ క‌న్‌సిడ‌రేష‌న్ ప్లాన్ వర్క‌వుట్ అయితే మాత్రం చాలా బావుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now