RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కి డ‌బుల్ ఆనందం పంచే వార్త ఇది..!

October 19, 2021 8:13 AM

RRR Movie : ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్‌, సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

RRR Movie good news to fans tease may release on diwali

అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా.. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ప‌రిస్థిత‌లు కుదుట ప‌డ‌డంతో సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవ‌ల‌ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్ చరణ్‌ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను తానే చెప్పుకోవడం విశేషం.

రామ్ చరణ్.. తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. అటు అజయ్ దేవ్‌గణ్, ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట. సినిమా ఫైన‌ల్ వ‌ర్క్స్ అన్నీ పూర్తి అయిన నేప‌థ్యంలో చిత్ర టీజ‌ర్‌ని దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. దీపావ‌ళి రోజున ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టి.. ఆ త‌ర్వాత మూవీపై అంచ‌నాలు పెంచే కార్య‌క్ర‌మాల‌ను వేగంగా చేయాల‌ని.. నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now