RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్‌లు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారో తెలుసా ?

December 24, 2021 1:07 PM

RRR Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ్‌లు హీరోలుగా వ‌స్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఇప్ప‌టికే ఈ మూవీకి చెందిన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ మూవీకి చెందిన ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచారు. అనేక చోట్ల ప్రెస్ మీట్లు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

RRR Movie do you know how much ntr and charan took as remuneration for this film

ఇక గ‌తంలో రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి క‌న్నా ఎక్కువ మొత్తంలో ప్ర‌మోష‌న్ల‌ను చేసి ఆ మూవీ క‌న్నా ఆర్ఆర్ఆర్‌కు పెద్ద మొత్తంలో ప‌బ్లిసిటీ వ‌చ్చేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అందులో భాగంగానే రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌పై కూడా క‌న్నేశారు. అయితే ఈ మూవీలో న‌టించినందుకు గాను తార‌క్‌, చ‌ర‌ణ్‌లు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు ? అనే వార్త ఒక‌టి ప్ర‌స్తుతం ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌రి ఈ మూవీకి వారు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంత అంటే..

ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను రామ్ చ‌ర‌ణ్, ఎన్‌టీఆర్‌ల‌కు చెరో రూ.45 కోట్ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఓ బాలీవుడ్ మీడియా సంస్థ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌న్‌, ఆలియా భ‌ట్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. సినిమాలో వీరి క్యారెక్ట‌ర్ల పాత్ర నిడివి త‌క్కువే. అయిన‌ప్ప‌టికీ వీరికి కూడా భారీ మొత్తంలోనే రెమ్యున‌రేష‌న్ అందిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీకి అజ‌య్ దేవ‌గ‌న్‌కు రూ.25 కోట్లు, ఆలియా భ‌ట్‌కు రూ.9 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక రాజ‌మౌళి ఈ మూవీలో 30 శాతం లాభాల‌ను తీసుకునేట్లు ఒప్పందం చేసుకున్నార‌ట‌. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7, 2022వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now