RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీని ఓటీటీలో ఎంత మంది చూశారో తెలుసా ? షాక‌వుతారు..!

June 13, 2022 1:33 PM

RRR Movie : దర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన లేటెస్ట్ చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇందులో ఎన్‌టీఆర్ భీమ్‌గా క‌నిపించ‌గా.. రామ్ చ‌ర‌ణ్ అల్లూరిగా న‌టించి అల‌రించారు. ఈ క్ర‌మంలోనే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. బాహుబ‌లి త‌రువాత రాజ‌మౌళి మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీలోనూ సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన 50 రోజుల‌కు ఓటీటీలో రిలీజ్ చేశారు. అప్ప‌టికే ఈ మూవీ రూ.1100 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. ఇక ఇప్ప‌టికీ ఈ మూవీ ప‌లు చోట్ల ప్ర‌ద‌ర్శితం అవుతూనే ఉంది. అయితే ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. జీ5, నెట్ ఫ్లిక్స్‌ల‌లో ఈ మూవీ వివిధ భాష‌ల్లో రిలీజ్ అయింది. అయితే రెండింటిలోనూ భారీ స్థాయిలో ఈ మూవీకి వ్యూస్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయా ఓటీటీ సంస్థ‌లు ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన ప‌లు గ‌ణాంకాల‌ను విడుద‌ల చేశాయి. వాటి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

RRR Movie creates records on OTT platforms also
RRR Movie

జీ5 యాప్‌లో తెలుగుతోపాటు మ‌రో 4 భార‌తీయ భాష‌ల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్ష‌న్ రిలీజ్ అయింది. ఈ క్ర‌మంలోనే రెండు సంస్థ‌లు కూడా పోటీ ప‌డి మ‌రీ ఆర్ఆర్ఆర్ మూవీకి ప్ర‌మోష‌న్స్ చేశారు. అయితే నెట్ ఫ్లిక్స్‌కు గ్లోబ‌ల్ రీచ్ ఎక్కువ క‌నుక అందులో వ్యూస్ బాగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయిన 3 వారాల్లో మొత్తం 39,480,000 గంటల వ్యూస్ వ‌చ్చాయి. ఇక జీ5లో అన్ని భాష‌ల్లోనూ క‌లిపి 16,666,667 గంటల వ్యూస్ వ‌చ్చాయి. అంటే నెట్ ఫ్లిక్స్‌లోనే ఈ మూవీ ఎక్కువ వ్యూస్‌ను సాధించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ప‌లువురు విదేశీ సెల‌బ్రిటీలు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ చాలా బాగుంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డుల వేట దిశ‌గా కొన‌సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now