RRR Movie : ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్ వ‌చ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

May 12, 2022 10:22 AM

RRR Movie : ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించింది. బాహుబ‌లి 2 లాగా క‌లెక్ష‌న్ల‌ను సాధించ‌లేక‌పోయినా.. భారీ ఎత్తున క‌లెక్ష‌న్ల‌ను అయితే రాబ‌ట్టింది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్‌లు యాక్టింగ్‌ను అద‌ర‌గొట్టేశారు.

కాగా థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే ప్రేక్ష‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇక ఓటీటీలో ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మవుతోంది. ఈ మూవీకి గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 సంస్థ ఇప్ప‌టికే భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. క‌నుక అదే ప్లాట్‌ఫామ్‌పై ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. మే 20వ తేదీన ఆర్ఆర్ఆర్ ను జీ5 యాప్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. దీంతో ప్రేక్ష‌కుల‌కు మ‌ళ్లీ ఓటీటీ వేదిక‌గా వినోదం ల‌భ్యం కానుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

RRR Movie coming on OTT ZEE5 app know the date
RRR Movie

ఇక జీ5లో ఈ మూవీ తెలుగుతోపాటు త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్ష‌న్‌ను మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాకే విడుద‌ల చేయ‌నున్నారు. అయితే జూన్ మొద‌టి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ చాలా ముందుగానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తుండ‌డం విశేషం. ఇక ఓటీటీలో కూడా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో సినిమాను రిలీజ్ చేస్తారా.. లేక సాధార‌ణంగానే రిలీజ్ చేస్తారా.. అన్న విష‌యంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. దీనిపై మ‌రిన్ని వివ‌రాల‌ను ఇంకో రెండు మూడు రోజుల్లో వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now