RRR : వామ్మో.. ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షో టిక్కెట్ ధ‌ర రూ.5000..?

March 20, 2022 8:07 AM

RRR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క మూవీ.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది. ఇక అమెరికాలో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్స్ రూపంలో ఈ సినిమా సుమారుగా 20 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. కాగా సినిమా విడుద‌ల‌కు ముందు రోజు.. అంటే 24వ తేదీ రాత్రి హైద‌రాబాద్‌లోని ప‌లు చోట్ల ఈ సినిమాకు బెనిఫిట్ షోస్ వేయ‌నున్నారు.

RRR  movie benefit show ticket price is Rs 5000
RRR

హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో ఉన్న 4 థియేట‌ర్ల‌లో, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న 3 థియేట‌ర్ల‌లో మొత్తం 7 థియేట‌ర్ల‌లో బెనిఫిట్ షోస్ వేయ‌నున్నారు. విడుద‌ల‌కు ముందు రోజు రాత్రి ఈ బెనిఫిట్ షోస్‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ క్ర‌మంలోనే ఈ షోస్‌కు ఒక్కో టిక్కెట్ ధ‌ర రూ.3000 నుంచి రూ.5000 వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా.. ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు. డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టులు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌లు న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now