RRR Janani Song : హార్ట్ ఆఫ్ ది ఆర్ఆర్ఆర్.. జ‌న‌ని సాంగ్ వ‌చ్చేసింది…!

November 26, 2021 6:08 PM

RRR Janani Song : ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్.. జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్‌ స్పీడ్ పెంచారు. వ‌రుస పాట‌లు విడుద‌ల చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఇటీవ‌ల దోస్తీ, నాటు నాటు పాట‌లు విడుద‌ల కాగా, మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. ఇక సినిమాకు సోల్ అయిన జ‌న‌ని అనే పాటను రిలీజ్ చేశారు.

RRR Janani Song launched

ఆర్ఆర్ఆర్ మూవీలో లెక్కకు మించిన ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలతోపాటు హై అడ్రినలిన్ సీన్స్ ఉంటాయి. ప్రతి సన్నివేశానికి హార్ట్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ప్రతి సన్నివేశంతోపాటు అంతర్భాగంగా సాగుతూ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా సోల్ మనకు చెప్పేదే ఈ జనని సాంగ్. ఆర్ఆర్ఆర్ సినిమా సోల్ కి సంగీతం రూపం ఇస్తే జనని సాంగ్. ఈ సాంగ్ ఒక సాఫ్ట్ మెలోడీ, మూవీ మొత్తం సోల్ ఈ సాంగ్.

https://www.youtube.com/watch?v=xdpJWh5u-EI

ఒకరకంగా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ మూవీ హార్ట్ అని రాజ‌మౌళి రీసెంట్‌గా చెప్పారు. తాజ‌గా పాట చూస్తూ అదే అర్ధ‌మ‌వుతుంది. ప్ర‌ధాన పాత్ర‌లు ఎంతో భావోద్వేగంతో క‌నిపిస్తుండ‌గా, స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌తి స‌న్నివేశం ఎమోష‌న‌ల్‌గా సాగుతూ ఉంది. జ‌న‌ని సాంగ్ సినిమాపై భారీ అంచ‌నాలను పెంచింద‌నే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now