RRR Glimpse : ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ అదిరిపోయిందిగా.. భీమ్‌-రామ్ చించి ఆరేశారు..!

November 1, 2021 11:29 AM

RRR Glimpse : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్, తారక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొమురంభీమ్‌ పాత్రలో తారక్‌.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు.ద ర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైంది.

RRR Glimpse is wonderful stunning teaser

45 సెకన్ల నిడివితో విడుద‌లైన‌ ఈ వీడియోలో చరణ్‌-తారక్ అంద‌రినీ మెస్మ‌రైజ్ చేశారు. ఒక్క వీడియోతో అంద‌రి అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. ప్ర‌ధాన పాత్ర ధారులు అంద‌రూ టీజ‌ర్‌లో క‌నిపించారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లుక్స్ కేక పెట్టించాయి. యుద్ధ స‌న్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ వాటిల్లో తారక్‌-చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. ఈ ఇద్ద‌రూ ఉన్న తొలి వీడియో ఇదే కావ‌డంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు షిస్తున్నారు. సినిమా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందట. చివరగా జక్కన్న ఈ సినిమాను ట్రిమ్ చేసి చివరగా 2 గంటల 45 నిమిషాలకు అన్ని భాషల్లోనూ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇధే ఫైనల్‌ అని కూడా చెబుతున్నారట. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now