RRR : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇక గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం ప్రతి ఒక్క నటి, నటుడు ఎంతో కష్టపడి పని చేశారు.
వీరి కష్టం మొత్తం ఇప్పటికే పలు రకాలుగా ప్రేక్షకులకు చూపించారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, నటి శ్రియ, అజయ్ దేవగన్ వంటి పలువురు స్టార్ సెలబ్రెటీలు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఈ నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎవరు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారు.. అనే విషయానికి వస్తే..
డీవీవీ దానయ్య ఈ సినిమాను సుమారుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ చెరో రూ.45 కోట్ల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. ఇక సీత పాత్ర ద్వారా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతోంది. ఈ సినిమా కోసం ఆలియాభట్ ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అజయ్ దేవగన్‌కు రూ.25 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ సినిమా లాభాలలో 30 శాతం వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…