UPI : ఇక డెబిట్ కార్డు లేకున్నా.. యూపీఐ యాప్స్‌ను వాడుకోవ‌చ్చు..!

UPI : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డిజిట‌ల్ చెల్లింపులు చేస్తున్న విష‌యం విదిత‌మే. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్‌ను విప‌రీతంగా వాడుతున్నారు. న‌గ‌దు చెల్లింపులు త‌క్కువ‌య్యాయి. దేశంలో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకే కేంద్రం ఎన్‌పీసీఐ ద్వారా యూపీఐ మాధ్య‌మంలో చెల్లింపులు చేసేలా అవ‌కాశాల‌ను క‌ల్పించింది. అందులో భాగంగానే అనేక యూపీఐ యాప్స్ ఇప్పుడు డిజిట‌ల్ చెల్లింపుల సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అయితే వీటిల్లో రిజిస్ట‌ర్ అయి ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాలంటే క‌చ్చితంగా డెబిట్ కావ‌ల్సి వ‌స్తోంది. కానీ ఇక‌పై డెబిట్ కార్డు అవ‌సరం లేకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు. అందుకు గాను ఎన్‌సీపీఐ బ్యాంకుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

UPI

ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్‌లో రిజిస్ట‌ర్ అయ్యేందుకు క‌చ్చితంగా డెబిట్ కార్డు ఉండాల్సిందే. కానీ ఎన్‌పీసీఐ తెచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఇక‌పై డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ యాప్స్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అందుకు గాను ఆధార్ ఉంటే చాలు. దానికి మొబైల్ నంబర్ కూడా అనుసంధానం అయి ఉండాలి. దీంతో డెబిట్ కార్డు అవ‌సరం లేకుండానే యూపీఐ యాప్స్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఆ త‌రువాత డ‌బ్బుల‌ను పంపుకోవ‌చ్చు. చెల్లింపులు జ‌ర‌ప‌వ‌చ్చు.

అయితే ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాల‌ని ఎప్పుడో బ్యాంకుల‌ను ఆదేశించారు. కానీ బ్యాంకులు దీన్ని అమ‌లు చేయ‌డంలో ఆల‌స్యం చేస్తున్నాయి. ఇక ఎట్ట‌కేల‌కు ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు దీనికి బ్యాంకుల‌కు గ‌డువిచ్చారు. అందువ‌ల్ల ఈ తేదీ త‌రువాత ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో డెబిట్ కార్డు లేకున్నా యూపీఐ యాప్స్‌లో రిజిస్ట‌ర్ చేసుకుని తద్వారా బిల్లు చెల్లింపులు, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీంతో డెబిట్ కార్డు లేని వారికి, వాడ‌ని వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM

విడాకుల తర్వాత గోల్డెన్ టెంపుల్‌లో హన్సిక.. వైరల్ అవుతున్న ‘కీలక’ పోస్ట్!

వ్యాపార వేత్త సోహైల్ ఖ‌తురియాతో విడాకులు తీసుకున్న అనంత‌రం హ‌న్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీల‌క పోస్టు…

Wednesday, 18 March 2026, 12:31 PM

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM