Romantic Movie : రొమాంటిక్‌ చిత్ర యూనిట్‌కు షాక్‌.. సినిమాను ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు..!

October 30, 2021 9:23 PM

Romantic Movie : డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరీ, అందాల భామ కేతిక శర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో లవ్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊహించ‌ని క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంటోంది. తొలి రోజు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే మూవీ థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శితం అవుతున్న స‌మ‌యంలోనే ఈ మూవీ పైర‌సీ బారిన ప‌డింది.

Romantic Movie leaked online by tamil rockers

త‌మిళ్‌ రాక‌ర్స్ రొమాంటిక్ మూవీని త‌మ సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేలా అవ‌కాశం క‌ల్పించారు. మూవీరూల్స్, టెలిగ్రామ్‌లో కూడా రొమాంటిక్ మూవీ అందుబాటులో ఉంది. ఒక‌వైపు క‌రోనా వ‌ల‌న పూర్తిగా థియేట‌ర్స్ తెర‌వ‌క‌పోవ‌డంతో బిజినెస్ జ‌ర‌గ‌క నిర్మాత‌లు నెత్తి ప‌ట్టుకుంటున్న ఈ స‌మ‌యంలో చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ కావ‌డం వారిని తెగ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇటీవ‌ల ల‌వ్ స్టోరీ, ట‌క్ జ‌గ‌దీష్, పాగల్, ఎస్ఆర్ కళ్యాణ మండపం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, దర్బార్ వంటి అనేక సౌత్ ఇండియన్ సినిమాలు పైరసీ బారిన ప‌డ్డాయి.

సౌత్ ఇండియన్ సినిమాలే కాదు, హిందీ సినిమాలు కూడా పైరసీకి గురి అవుతున్నాయి. సల్మాన్ ఖాన్, దిశా పటానీ నటించిన హిందీ చిత్రం రాధేతో సహా అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పైర‌సీ బారిన ప‌డి నిర్మాత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేశాయి. సినిమా ప‌రిశ్ర‌మ మొద‌టి నుండి కూడా ఈ పైర‌సీతో ఇబ్బందులు ప‌డుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now