Roja : నటి, జబర్దస్త్ జడ్జి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్ తో కలిసి ప్రేమ తపస్సు అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన రోజా.. సీతారత్నంగారి అబ్బాయితో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు రోజా.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. రోజా ప్రముఖ తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెంబురతి మూవీతో రోజా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీని సెల్వమణినే తెరకెక్కించారు. ఈ సినిమా సమయంలోనే సెల్వమణి, రోజాల మధ్య స్నేహం ఏర్పడగా.. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది. అయితే సెల్వమణి తాను ప్రేమిస్తున్న విషయాన్ని మొదట రోజాకు కాకుండా.. ఆమె తల్లిదండ్రులకు చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న రోజా.. మొదట షాక్ అయినా ఆ తర్వాత సెల్వమణితో పెళ్లికి ఒకే చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. రోజా ఓకే చెప్పాక సెల్వమణిని ఆమె పెళ్లి చేసుకోవడానికి 11 ఏళ్లు పట్టిందట.
ఈ ఆలస్యానికి కారణమేంటంటే.. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్ లను వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. అందుకే ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో వారిని సెటిల్ చేయాలని భావించిందట రోజా. అందులో భాగంగానే సమరం అనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయట. రోజా అనేక సార్లు షూటింగ్ లో గాయపడింది. ఎలాగోలా ఈ సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అలా ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు రోజా మరికొంత కాలం చిత్రాలు చేయాల్సి వచ్చింది.
ఇలా అనుకోని సంఘటనలు వీరి వివాహాన్ని వాయిదా వేశాయి. చివరకు రోజా, సెల్వమణిలు 2002లో పెళ్లి చేసుకోగా.. వీరికి కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ లోహిత్ జన్మించారు. సినిమాలకు కొంత విరామం తర్వాత రోజా.. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కార్యక్రమాలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్నారు రోజా.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…