Roja : నాని కిరాణా కొట్టు పెట్టుకోవ‌డ‌మే బెట‌ర్‌.. రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

December 30, 2021 9:27 AM

Roja : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం రోజురోజుకీ హాట్‌టాపిక్‌గా మారుతోంది. టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని సినీనటులు కోరుతుండగా.. ప్రజల సంక్షేమం కోసమే ఈవిధంగా రేట్లు పెట్టామని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ప‌లు వ్యాఖ్య‌లు చేస్తూ ప‌నిలోపనిగా హీరో నానిపై కూడా విరుచుకుప‌డింది.

Roja said its best for nani to put grocery store

టిక్కెట్ల ధరలను తగ్గించటం అంటే ప్రేక్షకులను అవమానించటమేనని నాని చెబుతూ.. సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే కిరాణా దుకాణం కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. దీని పైన ఇప్పటికే మంత్రులు అనిల్.. బొత్సా.. పేర్ని నాని సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో నాని తన వ్యాఖ్యల ఉద్దేశం వేరని.. వాటిని ప్రజెంట్ చేసిన విధానం వేరని చెప్పుకొచ్చారు.

తాజాగా హీరో నాని వ్యాఖ్యలపై సినీ నటి, వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు. ఇలాంటి వాఖ్యలు రెచ్చగొట్టడమే అవుతుందని రోజా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. కొద్దిమంది రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని ఆమె అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now