Roja : ఫైర్ బ్రాండ్ రోజా.. మా ఎన్నిక‌ల్లో సైలెంట్ అయ్యారేంటి ? ఇదే కార‌ణ‌మా ?

October 12, 2021 8:03 AM

Roja : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు హోరా హోరీగా సాగాయి. నువ్వా నేనా అన్నంత స్థాయిలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత హైప్ ఈ సారి మా ఎన్నిక‌ల‌కు వ‌చ్చింది. అయితే చివ‌రికి ఉత్కంఠ పోరులో మంచు విష్ణుదే పైచేయి అయింది. ఆయ‌న ప్ర‌కాష్ రాజ్‌పై అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించారు. దీంతో మంచు విష్ణుకు ఇండ‌స్ట్రీ నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నిక‌లు ఆద్యంతం మా స‌భ్యురాలు అయిన ఎమ్మెల్యే రోజా మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి కూడా పెద్ద హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి ఓటు వేసి నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లిపోయారు. ఫైర్ బ్రాండ్‌గా రాజ‌కీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న రోజా మా ఎన్నిక‌ల్లో మాత్రం సైలెంట్‌గా ఉండ‌డంపై ర‌క ర‌కాల చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి.

Roja is silent maa elections this may be the reason

మా ఎన్నిక‌ల పోరులో భాగంగా కొంద‌రు టీడీపీ నాయ‌కులు అప్ప‌టికే మంచు విష్ణుకు వైసీపీ మ‌ద్ధ‌తు ఉంద‌ని ఆరోపించారు. త‌రువాత మంత్రి పేర్ని నాని అదేమీ లేద‌ని కొట్టి పారేశారు. మా ఎన్నిక‌ల‌కు, త‌మ ప్ర‌భుత్వానికి, పార్టీకి ఏమీ సంబంధం లేద‌ని తేల్చేశారు. అయిన‌ప్ప‌టికీ మంచు విష్ణు విజ‌యం వెనుక వైసీపీతోపాటు బీజేపీ కూడా ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇంత ఉత్కంఠ పోరులో ఫైర్ బ్రాండ్ రోజా మాత్రం ఎక్క‌డా కామెంట్లు చేయ‌లేదు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

అయితే మా ఎన్నిక‌ల్లో రోజా సైలెంట్‌గా ఉండ‌డానికి కార‌ణం.. అప్ప‌టికే వైసీపీ మ‌ద్ద‌తు మంచు విష్ణుకు ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి, క‌నుక ఆ స‌మ‌యంలో ఆమె విష్ణుకు మ‌ద్ద‌తుగా మాట్లాడితే ఇంక ఆ ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుతుంది, అది ప్ర‌భుత్వానికి, పార్టీకి కొంత న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చు.. అన్న ఉద్దేశం ఉండి ఉంటుంది. అందుక‌నే ఆమె సైలెంట్‌గా ఉన్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆమె మంచు విష్ణుకే ఓటు వేస్తార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. అయితే ఇక‌పై ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డుతాయో చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now