Roja Daughter : నటిగా, ఎమ్మెల్యేగా సినిమా ఇండస్ట్రీలోనూ, రాజకీయాలలోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ.. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. రోజా తమిళ దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకున్నారు. వీరి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇంత చిన్న వయసులోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అన్షు ఎంతో అందంగా ఉండడంతో పలువురు అభిమానులు ఈమె వెండితెరపై ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనుంది.. అంటూ ఎన్నో సార్లు ప్రశ్నించారు. అయితే ఆ సమయం దగ్గర పడుతోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా రోజా కూతురు త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని.. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇప్పటికే రోజా కూతురు యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ కూడా తీసుకుంటుందని.. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తుందా.. లేక తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
రోజా కూతురు ఒక స్టార్ హీరో కొడుకుతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అయితే ఆ సినిమా ఏంటి ? దర్శకుడు ఎవరు ? అనే విషయాల గురించి త్వరలోనే తెలియజేయనున్నారు. రోజా కూతురు కూడా రోజా మాదిరి అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మరి ఈమె కూడా రోజా అంతటి గుర్తింపు సంపాదించుకుంటుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…